గొంతు కోసుకోవటానికైనా రెడీ : ఫిబ్రవరిలో క్లారిటీ ఇస్తా!
అవినీతిని రూపు మాపేందుకు తనకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటువేస్తే తాను గొంతు కోసి ఇవ్వటానికైనా సిద్ధంగా వున్నానని జనసేనాని వ్యాఖ్యానించారు.

అవినీతిని రూపు మాపేందుకు తనకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటువేస్తే తాను గొంతు కోసి ఇవ్వటానికైనా సిద్ధంగా వున్నానని జనసేనాని వ్యాఖ్యానించారు.
గుంటూరు : అవినీతిని రూపు మాపేందుకు తనకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటువేస్తే తాను గొంతు కోసి ఇవ్వటానికైనా సిద్ధంగా వున్నానని జనసేనాని వ్యాఖ్యానించారు. అవినీతి సర్వసాధారణంగా మారిపోయిందనీ..భోగిమంటల్లో అవినీతిని కాల్చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.గుంటూరు జిల్లా తెనాలిలోని పెదరావూరులో జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో పవన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అవినీతిలో కూరుకుపోయిన నాయకులు ఓట్లు అడగటానికి వస్తే ప్రజలు..యువత వారిని ప్రశ్నించాలని.. అవినీతి నాయకులకు ఓట్లు వేయకుండా వ్యతిరేకించాలని పవన్ పిలుపునిచ్చారు.
తనకు ఓటేసి గెలిపిస్తే మెడ కోసి ఇవ్వడానికైనా సిద్ధమని పేర్కొన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ, వైసీపీ రెండు విఫలమయ్యాయని పవన్ ఆరోపించారు. త్వరలో రైతుల సమస్యలపై విధాన ప్రకటన చేస్తానని చెప్పారు. ఫిబ్రవరి రెండో వారంలో స్పష్టతనిస్తానమని పవన్ తెలిపారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలు, విద్యార్థులతో భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెదరావూరులో బహిరంగ సభలో మాట్లాడుతు పనవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజలకు కావాల్సింది పింఛన్లు, రేషన్ బియ్యం మాత్రమే కాదనీ..ప్రజలకు మంచి భవిష్యత్తును అందించటమేనన్నారు.దేశానికి వెన్నెముకలాంటి రైతులు ఇక కష్టపడడానికి వీల్లేదన్నారు. వచ్చే నెల 2న రైతులతో సమావేశమై వారి కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించి జనసేన మేనిఫెస్టోలో చేరుస్తామన్నారు. నష్టాలతో విడిపోయిన రాష్ట్రాన్ని..అభివృద్ధి బాటలో పయనించాలనే ప్రజల కలను సాకారం చేసేందుకు ప్రభుత్వంతో పాటు యువత కూడా పాటు పడాలనీ..అదే స్ఫూర్తితో ఏపీ యువత కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఎన్నికలు జనసేనకు మొదటివీ కావు, ఆఖరివీ కావని జనసేనాని పవన్ స్పష్టం చేశారు.