పవన్‌ది ఆదర్శమే.. నామినేషన్ తిరస్కరిస్తే?
రెండు నియోజకవర్గాల నుండి పోటీలో దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తన నామినేషన్ పత్రాల్లో కులం గురించి, మతం గురించి ప్రస్తావించలేదు.

రెండు నియోజకవర్గాల నుండి పోటీలో దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తన నామినేషన్ పత్రాల్లో కులం గురించి, మతం గురించి ప్రస్తావించలేదు.
రెండు నియోజకవర్గాల నుండి పోటీలో దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తన నామినేషన్ పత్రాల్లో కులం గురించి, మతం గురించి ప్రస్తావించలేదు. పవన్‌తో పాటు, ఆ పార్టీలో ఇటీవలే చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా తమ నామినేషన్ పత్రాల్లో కులమత ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారు. కులం అనే కాలమ్‌లో తన కులాన్ని ప్రస్తావించలేదు. ఏ కులమో నింపాల్సిన ఖాళీలో ‘నాట్ అప్లికబుల్’ అని రాసారు. తాను ఏ కులానికి చెందిన వాడిని కాదని చెప్పటమే అక్కడ పవన్ ఉద్దేశంగా కనిపిస్తోంది.
Read Also : ఎన్నికలకు మరో ఇరవై రోజులే : మేనిఫెస్టో రిలీజ్ చేయని టీడీపీ, వైసీపీ
అయితే ఈ రకంగా రాయటం ద్వారా ఇప్పుడు పవన్ నామినేషన్ వ్యవహారం ఆసక్తి కరంగా మారింది. నిబంధనల ప్రకారం ఒకవేళ వివరాలు సరిగ్గా లేవంటూ పవన్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండవచ్చని అంటున్నారు. అలాగే అభ్యర్దుల నామినేషన్ దాఖలు చేసే సమయంలో నామినేషన్ లోనే ఒక వేళ అభ్యర్ది నామినేషన్ సాంకేతిక కారణాలతో తిరస్కరిస్తే.. తనకు బదులుగా బరిలో ఉండాల్సిన వ్యక్తి పేరును సూచిస్తారు.
అయితే, వపన్ కళ్యాణ్, మాజీ జేడి లక్ష్మీనారాయణ మాత్రం తమ నామినేషన్‌లలో ఆ విధంగా సూచించలేదు. రిజర్వుడు నియోజకవర్గాలు అయితేనే కులం ఖచ్చితంగా రాయవలసి ఉంటుందని, రిజర్వుడు నియోజక వర్గాల్లో పవన్ పోటీ చేయట్లేదు కాబట్టి కులం అందులో రాయవలసిన అవసరం లేదు అని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ఆదర్శం కోసం పవన్ ఈ రకరమైన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
Read Also : వైసీపీ షాకింగ్ డెసిషన్ : హిందూపురం బరిలో గోరంట్ల మాధవ్ భార్య