ఎమ్మెల్యే కోటంరెడ్డి దౌర్జన్యం చేస్తున్నారు : మహిళా ఎంపీడీవో ఫిర్యాదు
వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళా ఎంపీడీవోపై దౌర్జన్యం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు వెంకటాచలం

వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళా ఎంపీడీవోపై దౌర్జన్యం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు వెంకటాచలం
వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళా ఎంపీడీవోపై దౌర్జన్యం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు వెంకటాచలం ఎంపీడీవో సరళ.. ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొలగమూడి దగ్గర ఓ వెంచర్ విషయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి తనను బెదిరించారని ఎంపీడీవో సరళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. వెంచర్ కి నీటి కనెక్షన్ మంజూరు చేయలేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి తనపై దౌర్జన్యానికి దిగారని చెప్పారు. అర్థరాత్రి తన ఇంటికి వచ్చి హంగామా చేశారని వాపోయారు.
వెంచర్ కు నీటి కనెక్షన్ ఇవ్వాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి డిమాండ్ చేశారని సరళ తెలిపారు. నీటి కనెక్షన్ వ్యవహారం నా పరిధిలో లేదని చెప్పినా వినకుండా ఎమ్మెల్యే తనను బెదిరించారని ఆమె వాపోయారు. అంతేకాదు.. తన ఇంటికి కరెంటు, నీళ్ల కనెక్షన్ కట్ చేశారని పోలీసులతో చెప్పారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఎంపీడీవో సరళ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సీఎం జగన్ స్పందించాలని, న్యాయం చేయాలని వేడుకున్నారు. తనకు తన కుటుంబానికి ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించాలన్నారు.