ఆత్మహత్యా? గుండెపోటా?: గోడలు దూకి కోడెల ఇంట్లోకి వెళ్లిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి, స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతిపై రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే కోడెల శివప్రసాదరావు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్న ఇంటికి వెళ్లారు పోలీసులు.
గుండెపోటు కారణంగా ఆస్పత్రిలో చేరినట్టు మొదట ప్రచారం సాగగా.. ఆత్మహత్య చేసుకున్నారా? లేక గుండెపోటేనా? మృతికి ఇంకేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కోడెల ఆత్మహత్య ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
పల్నాటి పులిగా పేరుగాంచిన కోడెల ఆకస్మిక మరణం వెనక అసలేం జరిగింది? అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టగా.. కోడెల ఇంటికి వెళ్లారు పోలీసులు. ఇంటికి తాళం వేసి ఉండడంతో గోడ దూకి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. క్లూస్ టీమ్ తో పాటు ఇంట్లోకి వెళ్లారు.
ఇంట్లో ఒక లేడీతో పాటు పనిమనుషులు ఉన్నట్లుగా తెలుస్తుంది. గేటుకు తాళాలు ఎందుకు వేశారనే విషయంపై ఇంట్లోని వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. బసవతారం ఆసుపత్రికి కూడా కమిషనర్ అంజనీ కుమార్ చేరుకున్నారు.