సీఈసీ పరిధిలోకి పోలీస్ యంత్రాంగం : ఇంటెలిజెన్స్ డీజీకి మినహాయింపు

అమరావతి : సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో డీజీపీ సహా పోలీస్ యంత్రాంగాన్ని సీఈసీ పరిధిలోకి తెస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి తీసుకొచ్చింది. డీజీపీ సహా ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు సీఈసీ పరిధిలోకి వస్తారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు పోలీస్ యంత్రాంగం సీఈసీ పరిధిలో పనిచేయనుంది. పోలీసులు విధులు నిర్వర్తించనున్నారు.
అయితే ఈ జీవోలో ఇంటెలిజెన్స్ డీజీకి మినహాయింపు ఇచ్చారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ నిబంధనల మేరకే తాజా ఉత్తర్వులు ఇచ్చామని ప్రభుత్వం తెలిపింది. ఈసీ తాజా ఆదేశాలతో ప్రభుత్వ జీవోకు ప్రాధాన్యత సంతరించుకుంది.