ఆ బాధ భరించలేక : ప్రముఖ రచయిత్రి ఆత్మహత్య
విశాఖకు చెందిన ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యురాలు జగద్ధాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం(ఆగస్టు 24,2019) విశాఖపట్నంలోని ఇంట్లో

విశాఖకు చెందిన ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యురాలు జగద్ధాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం(ఆగస్టు 24,2019) విశాఖపట్నంలోని ఇంట్లో
విశాఖకు చెందిన ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యురాలు జగద్ధాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం(ఆగస్టు 24,2019) విశాఖపట్నంలోని ఇంట్లో ఉరివేసుకున్నారు. ప్రముఖ రచయిత, సన్నిహితుడు రామతీర్థ ఆకస్మికంగా మృతి చెందడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఆ మానసిక క్షోభతోనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో జగద్ధాత్రి పలు రచనలు చేశారు. కవితలు రాశారు. ట్రాన్సలేటర్ కూడా. లెక్చరర్‌గానూ పని చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తోటి కవులతో స్నేహంగా ఉండేవారు.
జగద్ధాత్రి మృతితో సాహిత్య లోకంలో విషాదం నెలకొంది. పలువురు సాహితీవేత్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త విని ప్రముఖ కవయిత్రి మెర్సీ మార్గరేట్ షాక్ తిన్నారు. ‘జగద్దాత్రి అక్కా .. ఎంత పని చేశావ్ ..నిన్ను చూస్తుంటే ఎంత ధైర్యంగా ఉండేది.. దుఃఖం ఆగట్లేదక్కా’ అని జగద్ధాత్రి మృతి పట్ల సంతాపం తెలిపారు.
ఉత్తరాంధ్రతోపాటు ఒడిశాలోనూ అనేక సాహితీ సదస్సులు నిర్వహించారు జగద్ధాత్రి. ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడెమీ సభ్యురాలిగా ఉన్నారు. జగద్ధాత్రి మరో ప్రఖ్యాత రచయిత రామతీర్థతో కలిసి జీవించేవారు. కొద్ది రోజుల కిందట రామతీర్థ గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటి నుంచి జగద్ధాత్రి తీవ్ర మనస్తాపం చెందారు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, తనకు చెందిన వస్తువులు, ఆస్తిపాస్తులు రాజేష్ అనే వ్యక్తికి అందజేయాలని సూసైడ్ నోట్ లో రాశారు.