క్షుద్రపూజలు చేస్తోందనే అనుమానంతో మహిళపై సర్పంచ్ దాడి

  • Published By: veegamteam ,Published On : October 30, 2019 / 08:09 AM IST
క్షుద్రపూజలు చేస్తోందనే అనుమానంతో మహిళపై సర్పంచ్ దాడి

Updated On : October 30, 2019 / 8:09 AM IST

అనారోగ్యం వస్తే హాస్పిటల్ కు తీసుకెళ్లాలి. కానీ తన కుమారుడికి అనారోగ్యంగా ఉందని..దానికి కారణం ఓ మహిళేనని గ్రామ సర్పంచ్ ఓ మహిళపై దాడికి పాల్పడ్డాడు. ఇష్టానుసారంగా కొట్టాడు. ఈ ఘటన మహబూబర్ నగర్ జిల్లా కంబాలపల్లిలో జరిగింది.

కంబాలపల్లి గ్రామ సర్పంచ్ సంఘ వీరన్న కుమారుడు వంశీకి కొన్ని రోజుల నుంచి అనారోగ్యానికి గురయ్యాడు.  దీంతో తన కుమారుడు అనారోగ్యం పాలవవ్వటానికి సాలేహా అనే ఓ ముస్లిం మహిళే కారణమని నమ్మాడు.

సాలేహా మంత్రాలు వేసి..పూజలు చేస్తోందని అందుకే  తన కుమారుడికి అనారోగ్యం వచ్చిందని భావించిన వీరన్న ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సాలేహపై దాడికి పాల్పడ్డాడు. ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. ఈ దాడిలో సాలేహ తీవ్రంగా గాయపడింది. ఈ విషయాన్ని భర్తతో చెప్పింది. వెంటనే సాలేహ భర్త సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.