మాస్కుపై మత్తు చల్లి..బాలికపై కాంట్రాక్టర్ అత్యాచారం

  • Published By: nagamani ,Published On : September 5, 2020 / 03:36 PM IST
మాస్కుపై మత్తు చల్లి..బాలికపై కాంట్రాక్టర్ అత్యాచారం

Updated On : September 5, 2020 / 3:57 PM IST

కామాంధులకు చిన్నారి చిట్టితల్లులు బలైపోతున్నారు. కోవిడ్ భయంతో పెట్టుకునే మాస్కులను కూడా దారుణాలకు వాడేసుకుంటున్నారు. మాస్కులపై మత్తు జల్లి అది పెట్టుకున్న బాలిక స్మృహ కోల్పోయాక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆగస్టు 29న పంజాబ్ రాష్ట్రంలో జరిగింది.

కరోనా వల్ల పెద్దగా పనులు లేవు..ఉన్న కొద్దిపాటి పనులు దొరకటమే భాగ్యంగా అది ఎంతకష్టమైన పనై సరే చేయాల్సిన పరిస్థితులు. అలా జిరాక్పూర్ ప్రాంతంలో స్థానికంగా ఉండే సంత్ రాజ్ యాదవ్ అనే లేబర్ కాంట్రాక్టర్ పని ఉందని ఓ బాలికను రమ్మన్నాడు. పనిదొరికిందనే సంతోషంతో ఆమె వెళ్లింది. పనిచేసే ప్రాంతంలో కూడా మాస్క్ తప్పకుండా పెట్టుకోవాలనే రూల్ ఉంది..నువ్వు మాస్క్ తెచ్చుకోలేదు కాబట్టి నా దగ్గర మాస్క్ ఉంది ఇస్తానని అన్నాడు.దానికి బాలిక సరేనంది. అదే అదనుగా భావించిన ఆ కాంట్రాక్టర్ ఆ బాలికకు ఇచ్చే మాస్క్ మీద మత్తుమందు జల్లి ఇచ్చాడు. అది తెలియని ఆమె మాస్క్ పెట్టుకుంది.

తరువాత కొంతసేపటికే అపస్మారస్థితిలోకి వెళ్లిపోయి అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఆ కాంట్రాక్టర్ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు.తరువాత ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు.

దీంతో భోరునఏడుస్తూ మౌనంగా ఉండిపోయింది. కానీ తరువాత కూడా ఆ కాంట్రాక్టర్ తనను పదే పదే లొంగిపోవాలని బెదిరించటంతో ధైర్యం కూడగట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని కాంట్రాక్టర్‌ సంత్ రాజ్ యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు.