రాజధానిపై రామ్‌గోపాల్ వర్మ : జగన్ గేమ్ ఆడుతున్నారు

  • Published By: veegamteam ,Published On : December 27, 2019 / 10:46 AM IST
రాజధానిపై రామ్‌గోపాల్ వర్మ : జగన్ గేమ్ ఆడుతున్నారు

Updated On : December 27, 2019 / 10:46 AM IST

ఏపీ రాజధానిపై  వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్ చేశారు. సీఎం జగన్ ఏపీలో రాజధాని గేమ్ ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. తన దృష్టిలో రాజధాని అనే పదానికి అర్ధమే లేదన్న వర్మ.. రాజకీయాలతో సంబంధంలేని సామాన్యులకు రాజధాని ఎక్కడ ఉన్నా ఇబ్బంది లేదన్నారు. రాజధానిని ప్రక్క రాష్ట్రంలో పెట్టినా పట్టించుకోనని.. తనకు రాజధాని ఎక్కడ ఉన్నా ఇబ్బంది లేదన్నారు.

పరిపాలన కోసమే రాజధాని కావాలంటే సిటీ కో రాజధాని ఉండాలని వ్యాఖ్యానించారు. తన దృష్టిలో రాజధాని అన్న పదానికి అర్ధమే లేదన్నారు. ఏ అర్ధం లేనప్పుడు అనకాపల్లిలో ఉంటే ఏంటి? చెన్నైలో ఉంటే ఏంటి? అంటూ తనదైనశైలిలో వ్యాఖ్యానించారు. రాజధాని అంటే మెయిన్ థియేటర్‌ లాంటిదన్నారు. ప్రజలకు నేరుగా పాలన అందాలనుకుంటే.. ప్రతి టౌన్‌కి ఒక క్యాపిటల్‌ ఉండాలని రాంగోపాల్‌ వర్మ అన్నారు.