పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల ఎదురుదాడి

  • Published By: veegamteam ,Published On : August 27, 2019 / 04:40 AM IST
పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల ఎదురుదాడి

Updated On : August 27, 2019 / 4:40 AM IST

చిత్తూరు తిరుమల కొండపై శేషాచలం అడవుల్లోని రాజమాను గుంట అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. మంగళవారం (ఆగస్టు 27) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ పోలీసులపై ఎదురుదాడికి దిగి తప్పించుకున్నారు. తప్పించుకుంటున్నవారిని పోలీసులు వెంటాడారు. ఈ సమయంలో పోలీసులపై స్మగ్లర్లు రాళ్లతో ఎదురుదాడికి దిగారు. అనంతరం పరారయ్యే క్రమంలో వారిని వెంటాడిన పోలీసులు ఒకరిని పట్టుకున్నారు. అనంతరం అరెస్ట్ చేశారు. ఘటనాస్థలం నుంచి 9 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

కాగా శేషాచలం అడవుల్లోని ఈతమాను గుంట, చీకటిగలకోన, కల్యాణి డ్యామ్ పరిసరప్రాంతాల్లో రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేస్తుండగా తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు తారసపడ్డారు. పోలీసులను చూసిన వెంటనే దుంగలను అక్కడే వదిలేసి రాళ్లతో దాడి చేసి చీకట్లో తప్పించుకున్నారు. ఘటనా స్థలంలో ఓ స్మగ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 9 ఎర్రచందనం దుంగలను సీజ్ చేశారు. పరారీలో ఉన్న స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టారు.