దేవాలయ పాలకమండళ్లు, ట్రస్ట్‌ బోర్డుల్లో రిజర్వేషన్లు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయ పాలకమండళ్లు, ట్రస్ట్‌ బోర్డుల్లో రిజర్వేషన్లను అమలు చేయనుంది.

  • Published By: veegamteam ,Published On : September 13, 2019 / 09:26 AM IST
దేవాలయ పాలకమండళ్లు, ట్రస్ట్‌ బోర్డుల్లో రిజర్వేషన్లు

Updated On : September 13, 2019 / 9:26 AM IST

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయ పాలకమండళ్లు, ట్రస్ట్‌ బోర్డుల్లో రిజర్వేషన్లను అమలు చేయనుంది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయ పాలకమండళ్లు, ట్రస్ట్‌ బోర్డుల్లో రిజర్వేషన్లను అమలు చేయనుంది. ఈమేరకు గురువారం (సెప్టెంబర్ 13, 2019) రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దేవాలయ పాలకమండళ్లలో రిజర్వేషన్ల అమలుపై గత అసెంబ్లీ సమావేశాల్లో సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. దేవాలయ కమిటీలు, ట్రస్ట్‌ బోర్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం పదవులు, అలాగే మహిళలకు 50 శాతం పదవులు కేటాయించేలా ఉత్తర్వులు జారీ చేశారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ, అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్న హామీ మేరకు ఏపీ ప్రభుత్వం దేవాలయ పాలకమండళ్లు, ట్రస్ట్‌ బోర్డుల్లో రిజర్వేషన్లను కల్పించింది. 
సాంఘిక దూరాచారాలను దూరం చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యగా చెప్పవచ్చు. అన్ని వర్గాలకు ఆలయాల్లో సమానత్వం కల్పించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. రానున్న పాలకమండళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.

Also Read : పోటెత్తుతున్న వరద : నాగార్జునసాగర్‌ 24 గేట్లు ఎత్తివేత