సీఎం కేసీఆర్ వరాల జల్లు : హుజూర్ నగర్ కు రూ.25 కోట్లు
హుజూర్ నగర్ నియోజకవర్గం ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. హుజూర్ నగర్ పట్టణానికి సీఎం ఫండ్ నుంచి 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

హుజూర్ నగర్ నియోజకవర్గం ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. హుజూర్ నగర్ పట్టణానికి సీఎం ఫండ్ నుంచి 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
హుజూర్ నగర్ నియోజకవర్గం ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. హుజూర్ నగర్ పట్టణానికి సీఎం ఫండ్ నుంచి 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం (అక్టోబర్ 26, 2019) హుజూర్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ నేరేడుచెర్ల మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. వీటికి వెంటనే నిధులు విడుదల చేస్తామన్నారు.
నియోజకవర్గంలోని 134 గ్రామ పంచాయతీలకు ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఏడు మండల కేంద్రాల్లో ప్రతి మండల కేంద్రానికి రూ.30 లక్షల చొప్పున మంజూరు చేస్తామని చెప్పారు. వెంటనే నిధులు విడుదల చేస్తామని చెప్పారు. గిరిజన బిడ్డల కోసం రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. హుజూర్ నగర్ లో బంజారా భవన్ ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. హుజూర్ నగర్ రెవెన్యూ డివిజన్ ను వెంటనే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
హుజూర్ నగర్ లో ఈఎస్ ఐ ఆస్పత్రి, పాలిటెక్నిక్ కాలేజీ, కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 3 వేల గిరిజన తండాలు, పెంటలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని తెలిపారు. మీ అందరి దీవెనలతోనే సైదిరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని తెలిపారు. గెలిపించిన అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. నీళ్లేవో, పాళ్లేవో బల్ల గుద్ది ప్రజలు మరీ చెప్పారని తెలిపారు.
హుజూర్ నగర్ కు రింగురోడ్డు, చెరువుపై ట్యాంక్ బండ్ తరహా నిర్మాణం చేపడతామని చెప్పారు. భారీగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. తెలంగాణలో ఏ ఇల్లైనా, ఏ మూలైనా తనదేనని చెప్పారు. తెలంగాణలో ఎక్కడ నీళ్లు రాకపోయినా దు:ఖం కూడా తనదే అన్నారు. నాగార్జున సాగర్.. ఒరిజినల్ పేరు నందికొండ ప్రాజెక్టు అని తెలిపారు. ఇకపై నాగార్జున సాగర్ ఆయకట్టు మీద దృష్టి పెడతానని చెప్పారు. తానే స్వయంగా సాగర్ ప్రాజెక్టు వరకు పర్యటిస్తానని చెప్పారు. అవసరమైన లిఫ్టులు మంజూరు చేస్తామని, కాల్వలకు మరమ్మతులు చేస్తామన్నారు. జిల్లాలో ప్రతి అంగుళానికి నీరు పారేలా చేస్తానని తెలిపారు.
త్వరలోనే పోడు భూముల సమస్యను ప్రజా దర్బార్ పెట్టి పరిష్కరిస్తామని చెప్పారు. నల్లగొండ జిల్లాలో ఇరిగేషన్ సమస్యలు చాలా ఉన్నాయని తెలిపారు. మంత్రి జగదీష్ రెడ్డి 300 కిలోమీటర్ల నుంచి కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చారని చెప్పారు. జగదీశ్ రెడ్డి చొరవతోనే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందన్నారు. పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తైతే జిల్లా ఆర్థిక ముఖచిత్రమే మారిపోతుందన్నారు.
సైదిరెడ్డిని గెలిపించిన హుజూర్ నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సైదిరెడ్డి గెలుపు కోసం కృషి చేసిన నేతలకు అభినందనలు తెలిపారు. ఉప ఎన్నిక మాలో సేవాభావాన్ని, మరింత అంకితభావాన్ని పెంచుతుందన్నారు. హుజూర్ నగర్ ప్రజలు ఇచ్చిన విజయం ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య టీఆర్ఎస్ ను గెలిపించారని తెలిపారు.