నా చావు కళ్లు తెరిపిస్తుంది : పోలీసులను హడలెత్తించిన CI వాట్సాప్ మెసేజ్

  • Published By: veegamteam ,Published On : April 28, 2019 / 06:13 AM IST
నా చావు కళ్లు తెరిపిస్తుంది : పోలీసులను హడలెత్తించిన CI వాట్సాప్ మెసేజ్

Updated On : April 28, 2019 / 6:13 AM IST

నిజామాబాద్ జిల్లాలో కలకలం చెలరేగింది. రుద్రూరు సీఐ వాట్సాప్ మేసేజ్ పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నా చావు కొందరి అధికారుల కళ్లు తెరిపిస్తుంది అంటూ పోలీస్ శాఖ వాట్పాప్ గ్రూప్ లో సీఐ దామోదర్ రెడ్డి మేసేజ్ పెట్టారు. ఒత్తిళ్లు భరించలేక బలిదానం తప్పదేమో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ మేసేజ్ చూసి ఉన్నతాధికారులు కలవరపడ్డారు. వెంటనే సీఐ దామోదర్ తో మాట్లాడారు. సెలవుపై వెళ్లాలని సీఐని ఆదేశించారు. ప్రత్యేక ఎస్కార్ట్ తో ఆయనను ఇంటికి పంపారు.

సీఐ దామోదర్ రెడ్డి బోధన్ ఏసీపీ పరిధిలో పని చేస్తున్నారు. వివాదాస్పదుడిగా పేరుంది. ఇప్పటికే పలు వివాదాల్లో ఉన్నారు. గుట్కా సీజ్ విషయంలో పలు మార్లు సస్పెండ్ కూడా అయ్యారు. దామోదర్ వ్యవహారశైలిపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దామోదర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని సమాచారం.