ఆయ్..కరోనా కదాండీ..నోములు గట్రా చేయమండీ..మా ఇంటికి వాయినాలు తీసుకురాకండే..

  • Published By: nagamani ,Published On : July 21, 2020 / 02:59 PM IST
ఆయ్..కరోనా కదాండీ..నోములు గట్రా చేయమండీ..మా ఇంటికి వాయినాలు తీసుకురాకండే..

కరోనా కాలంలో శ్రావణమాసం వచ్చేసింది. పూజలు పునస్కారాలు..నోములు అంటూ ఆడవాళ్లు మహా హడావిడి పడిపోయే మాసం శ్రావణమాసం. మరి ఈ కరోనా కాలంలో శ్రావణమాసం అంటూ ముత్తయిదవలు..పేరంటాళ్లు అంటూ హడావిడి అంత మంచిది కాదనే విషయం గుర్తించుకోవాలి. అందుకే ఈ విజ్ఞప్తి…ఈ కరోనా కాలంలో అతి ముఖ్యంగా ఆడవారికి అంటూ ఓ ఇంటిముందు నోటీసు బోర్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆడవారికి విజ్ఞప్తి..
‘‘ఈ సంవత్సరం కరోనా కారణంగా మా ఇంట్లోఎవ్వరూ నోములు నోచుకోవట్లేదు. వాయినాలు ఎవ్వరూ తీసుకుని రావద్దు..ఈ విషయాన్ని ముత్తైదువులు గమనించగలరు..సర్వేజనా సుఖినోభవంతు’’ అంటూ ఓ బోర్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ బోర్డు ఎక్కడంటే..ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంది. అసలే గోదావరి జిల్లావోళ్లు..వెటకారంతో పాటు ఇటువంటి క్రియేటివిటీలకు కూడా లోటు ఉండదు మరి.అంతేకదండీ మరి..గోదావరి జిల్లావోల్లు స్టైల్ అంటే ఇలాగే ఉంటాయండీ..ఇది ఎటకారం అనుకున్నా..క్రియేటివిటీ అనుకున్నా గానీ..దీంట్లో సాలా సాలా అర్థం ఉందండీ..కరోనా కాలం కదండీ..ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాగండీ..కరోనా వచ్చిదంటే..గోదారోళ్లనే కాదు సముద్రాలనే ఏసుకుపోదండీ..ఆయ్…కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఇటువంటి జాగ్రత్తలు ఆడోళ్లు అందేనంటు ముతైదువులు తీసుకోవాలని కోరుంటున్నామండీ..మరి తీసుకోండి..అది అందరికీ మంచిదండీ..

ఈ సంవత్సరం మన దేశంతోపాటు ప్రపంచంలోని చాలా దేశాలు corona మహమ్మారితో పోరాడుతున్నాయండి..అందేకాదండీ..రాబోయే నెలలు కూడా చాలా చాలా ప్రమాదకరమండీ..కాబట్టి జాగ్రత్తగా ఉండాలండీ..కాబట్టి మనం అందరం చాలా బాధ్యతతో, జాగ్రత్తతో, వ్యవహరించాల్సిన సమయం.. ఏ చిన్న పొరపాటు జరిగినా పెద్ద నష్టం జరిగే పెమాదం కూడా ఉంటదండీ..

దయచేసి ఆడవారు ఈ విషయాన్ని ఎవ్వరూ మర్చిపోవద్దు. పేరంటాలు పూజలు పేరిట పదిమందిని పిలవకండి. ఇది చాలా ప్రమాదానికి దారి తీస్తది. ఈ కరోనా కాలంలో దేవుళ్లు కూడా కరోనా నియమాలు పాటిస్తున్నారు. మనం కూడా నిజమైన భక్తులం అయితే పరిస్థితులను బట్టి నడుచుకోవాలి.అసలు భక్తి అంటే ఏంటి? మనం క్షేమంగా ఉండి, అందరి క్షేమాన్ని కోరుకోవటమేకదాండీ.. భక్తి అంటే పట్టుచీరలు కట్టుకుని పది రకాల పిండి వంటలు వండి నైవేద్యాలు పెట్టేయటమే కాదు. దేవుడికి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెట్టుకుంటే చాలు. ఒక చిన్న దీపారాధన, భక్తితో ఒక స్తోత్రం చేసుకుంటే చాలదా?

పదిమందిని పిలిచి ఎందుకీ ఆర్భాటాలు? ఎందుకు ఈ చాదస్తాలు? ఒక సంవత్సరం ఇంట్లో పూజ చేసుకో లేమా? మాస్కు పెట్టుకున్నాం కదా, శానిటైజర్ రాసుకుందాం కదా, దూరంగా కూర్చున్నాం కదా అని లైట్ తీసుకోవద్దు.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, దురదృష్టవశాత్తు ఎంతోమంది కరోనా బారిన పడుతున్నారు. ప్రసాదాలు తీర్ధాలు పంచడం వల్ల, ఇతరులని ఇబ్బంది పెట్టిన వాళ్లు అవుతారు. మీ భక్తి పేరుతో ఎవరిని ఇబ్బంది పెట్టకండి. మీరు పిలిచారు కదా అని మొహమాటంతో ఇష్టం లేకపోయినా, వచ్చి ఇబ్బంది పడతారు, ఇబ్బంది పెడతారు. ప్రతి కుటుంబంలోనూ పెద్దవాళ్లు, ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు, చంటి పిల్లలు, ఉండొచ్చు. దయచేసి ఆ విషయం గుర్తుంచుకోండి. దయచేసి ఎవరి ఇంట్లో వాళ్ళు హాయిగా ఉన్నదాంట్లో మనస్పూర్తిగా అమ్మవారిని పూజించుకుందాం.

భక్తి వేరు, చాదస్తాలు వేరు, దయచేసి అర్థం చేసుకోండి. 10 మందికి హాని కలిగించే విషయం ఏ మతము సమ్మతించదు. భగవంతుడు హర్షించ డు. ఒక్కరూ ఆదర్శంగా ఈ మార్గాన్ని అనుసరించి నా, పది మంది మిమ్మల్ని అనుసరిస్తారు, తద్వారా దేశానికి, వైద్య వ్యవస్థ కి మేలు చేసిన వారం అవుతాం.