SRHvsRCB: ఉప్పల్‌లో సమరం, బెంగళూరు వర్సెస్ హైదరాబాద్

SRHvsRCB: ఉప్పల్‌లో సమరం, బెంగళూరు వర్సెస్ హైదరాబాద్

Updated On : March 31, 2019 / 7:38 AM IST

సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సర్వం సిద్ధం చేసుకుంది. ఐపీఎల్‌లో 11వ మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకంగా మారనుంది. లీగ్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములతో సతమతమవుతోన్న బెంగళూరును ఓడించాలని ఎదురుచూస్తోంది. 

ఈ మ్యాచ్‌లో ఫేవరేట్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ కనిపిస్తున్నప్పటికీ ఆఖరి మ్యాచ్‍‌లో బెంగళూరు స్వల్ప వ్యత్యాసంతోనే ఓడిపోయింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  ఆఖరి బంతి వరకూ ఉత్కంఠ కొనసాగింది. గురువారం జరిగిన కీలకపోరులో డివిలియర్స్ దూకుడు జట్టుకు హైలెట్‌గా నిలిచింది. కోహ్లీ పరవాలేదనిపించినప్పటికీ అంతగా రాణించలేకపోయాడు. 
Read Also : కళ్యాణ వైభోగం : 15 మంది ట్రాన్స్‌జెండర్ల వివాహం

అన్ని విభాగాల్లో పటిష్ఠంగా కనిపిస్తోన్న సన్ రైజర్స్‌తో తలపడడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సంక్షిష్టమే. బ్యాటింగ్ విభాగం బాధిస్తున్న బెంగళూరు జట్టులో కోహ్లీ-డివిలియర్స్ ఇద్దరు నిల్చింటే విజయం సాధించడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. 

గతంలో ఆర్సీబీ.. ఎస్ఆర్‌హెచ్ తలపడిన సందర్భాల్లో ఇరు జట్ల ఫలితాలెలా ఉన్నాయంటే..

1. ఇరు జట్లు 13 మ్యాచ్‌లలో తలపడి 7 సార్లు సన్‌రైజర్స్ గెలిస్తే.. 5 సార్లు ఆర్బీబీ గెలిచింది. మరో మ్యాచ్ ఫలితం తెలియకుండానే ముగిసిపోయింది.
2. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ప్రతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌దే పైచేయి. 
3. ఈ ఇరు జట్ల పోటీలో విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరు సాధించాడు. మొత్తంగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ ప్రత్యర్థిగా కోహ్లీ 485పరుగులు చేశాడు. 
4. సన్‌రైజర్స్‌ జట్టులో బలంగా భువనేశ్వర్ కుమార్ కనిపిస్తున్నాడు. తానొక్కడే బెంగళూరు జట్టుపై 12వికెట్లు తీయగలిగాడు. 
Read Also : సందట్లో సడేమియా : ప్రచారంలో షర్మిళ ఉంగరం చోరీ యత్నం