SRHvsRR: విరుచుకుపడ్డ శాంసన్, సన్‌రైజర్స్ టార్గెట్ 199

హైదరాబాద్ బౌలింగ్‌పై రాజస్థాన్ విరుచుకుపడింది. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన రాజస్థాన్ 2 వికెట్ల నష్టపోయి సన్‌రైజర్స్‌కు 199 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. ఓపెనర్‌గా దిగిన అజింకా రహానె(70; 49బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సులు)తో శుభారంభాన్ని అందించాడు. మూడో వికెట్‌గా బరిలోకి దిగిన శాంజూ శాంసన్ సెంచరీకి మించిన స్కోరుతో అదరగొట్టాడు.
55 బంతుల్లో చెలరేగి (102)పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో ఉన్న బెన్ స్టోక్స్()చక్కని భాగస్వామ్యాన్ని అందించాడు. రషీద్ ఖాన్, షెహబాయ్ నదీమ్ చెరో వికెట్ తీయగలిగారు.