తప్పు చేశానని తేలితే చెప్పుతో కొట్టండి : పృధ్వీ సవాల్

తనపై వస్తున్న ఆరోపణలకు, సీఎం జగన్ మీద గౌరవంతో తానే స్వచ్చందంగా ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు నటుడు, వైసీపీ కార్యదర్శి పృధ్వీ చెప్పారు. గత నాలుగు నెలలుగా ఎస్వీబీసీ అభివృధ్దికి కృషి చేశానని ఆయన చెప్పుకొచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ ఎంక్వయిరీ వేయమని తానే కోరినట్లు పృధ్వీ చెప్పారు.
ఎంక్వయిరీలో క్లీన్ చిట్ వచ్చిన తర్వాతే తిరిగి ఎస్వీబీసీ ఛానల్ లో తిరిగి అడుగు పెడతానని ఆయన అన్నారు. తనపై కొందరు కావాలని కుట్ర పన్నారని పృధ్వీ చెప్పారు. తాను తప్పు చేసినట్లు తేలితే చెప్పుతో కొట్టండని ఆయన సవాల్ విసిరారు. పృధ్వీ ఆడియో టేపుల లీకైన వ్యవహారంపై హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేసంలో ఆయన మాట్లాడుతూ కొందరు గిట్టని వాళ్లు తనపై కుట్రపన్ని మిమిక్రీ వాయిస్ తో ఇలా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాను పద్మావతి గెస్ట్ హౌస్ లో మద్యం సేవించానని, కొండపై అపవిత్రం చేశానని ఆరోపణలు చేసారని…ఇప్పడే ఎవరైనా డాక్టర్లనుపిలిపించి నా బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేసుకోవచ్చని గత 9 నెలలుగా మద్యం తాగటం మానేశానని ఆయన చెప్పారు. పార్టీ మీద, సీఎం గారి మీద గౌరవంతో నా రాజీనామాను ఫ్యాక్స్ ద్వారా పంపించానని ఆయన అన్నారు . నాపై వచ్చిన ఆరోపణళపై నేను చాలా బాధ పడుతున్నానని…ఎస్వీబీసీ చైర్మన్ గా నా గొంతు నొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు మందుతాగే అలవాటు లేదని, పద్మావతి గెస్ట్‌హౌస్‌లో తాగానని నిరూపితమైతే ఈ చెప్పుతో కొట్టండని తన కాలికి ఉన్న చెప్పును తీసి మీడియా మైకుల ముందు పృథ్వీ పెట్టడంతో విలేకరులు విస్తుపోయారు. పండుగ పూటా తనపై ఇలాంటి ఆరోపణలు రావటంతో తన కుటుంబం, స్నేహితులు ఎంతో బాధపడ్డారని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని రైతులపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని పృధ్వీ చెప్పారు. తాను ఎంఏ చదివినా… రైతు కుటుంబంనుంచి వచ్చానని… అమరావతిలో కార్పోరేట్ ముసుగులో ఉద్యమం చేస్తున్న రియల్ ఎస్టేట్ రైతులను ఉద్దేశించి అన్నానే తప్ప అసలైన రైతులను ఉద్దేశించితాను అనలేదని వివరణ ఇచ్చారు.
ఎస్వీబీసీ చైర్మన్ గా ఆర్డర్స్ తీసుకోటానికి మాత్రమే తాను అమరావతి సెక్రటేరియట్ కు వెళ్లాను తప్ప అంతకు ముందెప్పుడూ నేను సచివాలయం చూడలేదని పృధ్వీ చెప్పారు. రాజధాని అమరావతి పేరుతో అక్కడ కట్టడాలన్నీసినిమా సెట్టింగుల్లా ఉన్నాయని పృధ్వీ తెలిపారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ ప్రాంతంలో కనీస సదుపాయాలు లేవని పోలీసులు చెప్పారన్నారు.
ఫేక్ వాయిస్ పెట్టి కుట్రచేసి నన్ను దెబ్బకొట్టారు.. స్వామి మీద ఒట్టేసి చెపుతున్నా… నేను తప్పుచేస్తేనేను నాశనం అయిపోతానని పృధ్వీ అన్నారు. జనవరి 10 వ తేదీ ఉదయం తాను స్టేడియం కు వెళితే కొందరుముసుగు ధరించి వచ్చిన వ్యక్తుల తన ముఖంపై పిడిగుద్దులు గుద్ది పారిపోయారని ఆయనచెప్పారు. తన సినీజీవతమే కాంట్రవర్షియల్ సినిమాతో మొదలైందని. అప్పటి నుంచి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు నాకు ఉన్నాయని… నేను జగన్ గారికి, విజయసాయిరెడ్డి గారికి పార్టీలోని పెద్దలకు దగ్గరవుతున్నానని కూడా నాపై కుట్ర చేసి ఇబ్బందుల పాల్జేశారని అన్నారు. తాను పదవిలో ఉన్నన్నినాళ్లు నా సొంత కార్లే వాడుకున్నానని…. డ్రైవర్ల జీతాలు కూడా తానే ఇచ్చుకున్నానని.. టీటీడీ సొమ్ములు ఏమీ వాడుకోలేదని పృధ్వీ వివరించారు.
ఫేక్ వాయిస్ పెట్టి కుట్రచేసి నన్ను దెబ్బకొట్టారు.. స్వామి మీద ఒట్టేసి చెపుతున్నా… నేను తప్పుచేస్తేనేను నాశనం అయిపోతానని పృధ్వీ అన్నారు. జనవరి 10 వ తేదీ ఉదయం తాను స్టేడియం కు వెళితే కొందరుముసుగు ధరించి వచ్చిన వ్యక్తుల తన ముఖంపై పిడిగుద్దులు గుద్ది పారిపోయారని ఆయనచెప్పారు.
తన సినీ జీవితమే మండలాధీశుడు అనే కాంట్రవర్షియల్ సినిమాతో మొదలైందని. అప్పటి నుంచి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు నాకు ఉన్నాయని… నేను జగన్ గారికి, విజయసాయిరెడ్డి గారికి పార్టీలోని పెద్దలకు దగ్గరవుతున్నానని కూడా నాపై కుట్ర చేసి ఇబ్బందుల పాల్జేశారని అన్నారు. తాను పదవిలో ఉన్నన్నినాళ్లు నా సొంత కార్లే వాడుకున్నానని…. డ్రైవర్ల జీతాలు కూడా తానే ఇచ్చుకున్నానని.. టీటీడీ సొమ్ములు ఏమీ వాడుకోలేదని పృధ్వీ వివరించారు.