స్వీట్ మెమరీ : చిన్నారి ప్రణయ్‌తో అమృత

మిర్యాలగూడ : మిర్యాలగూడ ప్రణయ్ దారుణ హత్య సంచలనం సృష్టించింది. పరువు హత్య ఒకటి. తన కుమార్తె.. వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు.. ప్రణయ్‌ని దారుణంగా హత్య చేయించాడు. ఆ సమయంలో అమృత ఐదు నెలల గర్భిణి. కాగా.. 2019, జనవరి 30వ తేదీన అమృత..ప్రణయ్‌ల పెళ్లి రోజునే అమృత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
తనకు పుట్టిన బాబుని..చూసుకుని ఒక పక్క ప్రణయ్ జ్ఞాపకాలు.. మరోపక్క బిడ్డ బోసి నవ్వులు వెరసి అమృత సంతోషంలో మునిగిపోయింది. అమృత, ప్రణయ్‌ల పెళ్లి రోజునే బాబు పుట్టడం మరో విశేషం. ఆ చిన్నారి బాబుని అమృత ఎత్తుకున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాబు అచ్చం ప్రణయ్‌లాగే ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కామెంట్స్‌తో బాబుకి ఆశీర్వాదాలు కూడా అందిస్తున్నారు.