టీడీపీ రెండవ జాబితా: పార్లమెంటు అభ్యర్ధులు వీళ్లే!

ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ రెండవ జాబితాతో పార్లమెంటు సభ్యులను కూడా ప్రకటించబోతుంది. తొలి విడత జాబితాలో 126మంది అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ రెండవ విడత ప్రకటనకు సిద్ధం అవుతుంది.
Read Also : పోత్తుల్లో భాగంగా పవన్ కీలక భేటీ.. క్లారిటీ వచ్చేస్తుంది
రెండవ విడతలో 50మంది అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు వేస్తున్న టీడీపీ అధిష్టానం.. 25మంది పార్లమెంటు సభ్యులను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. వాస్తవానికి 126మంది అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ నెల్లూరు జిల్లాలో ఆదాల ప్రభాకర్ రెడ్డికి సీటు కేటాయించినా పార్టీ మారడంతో ఆ సీటును వేరొకరికి కేటాయించాలని భావిస్తుంది. దీంతో మొత్తం 50మంది పేర్లు రెండవ జాబితాలో ఉండనున్నాయి.
తెలుగుదేశంలో ఖరారైనట్లు తెలుస్తున్న పార్లమెంటు అభ్యర్ధుల పేర్లు:
విజయవాడ- కేశినేని నాని
గుంటూరు- గల్లా జయదేవ్
నరసరావుపేట- రాయపాటి సాంబశివరావు
బాపట్ల- శ్రావణ్ కుమార్
ఒంగోలు- శిద్దా రాఘవరావు
నెల్లూరు- బీదా మస్తాన్‌రావు
చిత్తూరు- శివప్రసాద్
తిరుపతి- పనబాక లక్ష్మి
కడప- ఆదినారాయణరెడ్డి
హిందూపురం- నిమ్మల కిష్టప్ప
అనంతపురం- జేసీ పవన్ రెడ్డి
శ్రీకాకుళం- రామ్మోహన్‌నాయుడు
విజయనగరం- అశోక్ గజపతిరాజు
అరకు- కిషోర్ చంద్రదేవ్
అనకాపల్లి- ఆడారి ఆనంద్
కాకినాడ- చలమలశెట్టి సునీల్
ఏలూరు- మాగంటి బాబు
కర్నూలు- కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి
మచిలీపట్నం- కొనకళ్ళ సత్యనారాయణ
పెండింగ్‌లో ఉన్నవి:
విశాఖపట్నం- శ్రీభరత్
రాజమండ్రి- మాగంటి రూప
అమలాపురం- జీఎంసీ హరీష్
ఇక నరసాపురం, రాజంపేట, నంద్యాల అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదని తెలుస్తుంది.