జనసేనలోకి వంగవీటి! : పవన్‌తో భేటీ

టీడీపీ నేత వంగవీటి రాధా..మలికిపురంకు చేరుకున్నారు. మండలంలోని దిండి రిసార్ట్స్‌లో పవన్‌ను కలిసేందుకు వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే రిసార్ట్స్‌లో 2019, సెప్టెంబర్ 05వ తేదీ గురువారం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా పవన్ అక్కడకు చేరుకోనున్నారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేరుకున్నారు. ఆయనతో వంగవీటి రాధా మాట్లాడినట్లు సమాచారం.
పవన్‌తో వంగవీటి భేటీ అవుతారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమౌతోంది. సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న పవన్‌కు పి.గన్నవరం మండలం జి.పెదపూడి వద్ద అభిమానులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున్న తరలిరావడంతో వారికి పవన్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. సెప్టెంబర్ 06వ తేదీ శుక్రవారం కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండనున్నారు. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారిని పవన్ దర్శించుకోనున్నారు.
ఇక వంగవీటి రాధా విషయానికి వస్తే…ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌తో విబేధించి టీడీపీ కండువా కప్పుకున్నారు. విజయవాడ సెంట్రల్ సీటును వంగవీటి ఆశించారు. అయితే..ఈ నియోజకవర్గంలో మల్లాది విష్ణును జగన్ బరిలోకి దింపారు. దీంతో వైసీపీకి గుడ్ బై చెప్పి..టీడీపీ కండువా కప్పుకున్నారు. అక్కడ కూడా సీటు కేటాయించలేదు. పార్టీల కీలక పదవి వస్తుందని వంగవీటి భావించారు. ఎన్నికల్లో స్టార్ క్యాంపెయిన్‌గా మారి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ ఘోర పరాజయం చవి చూసింది. గతంలోనే పవన్‌తో వంగవీటీ రాధా భేటీ కావడంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది.