జోష్‌లో తెలుగు తమ్ముళ్లు : TDP స్టార్ క్యాంపెయిన్

ఎన్నికల ప్రచారంలో మరింత జోష్ పెంచేందుకు టీడీపీ స్టార్ క్యాంపెయినర్లను సిద్ధం చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తోన్న టీడీపీ… ప్రచారం కోసం 30 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితా ప్రకటించింది. వీరిలో పలువురు తాము పోటీ చేస్తున్న స్థానాల్లో ప్రచారం చేస్తూనే… రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.
Read Also : నోరు అదుపులో: ఎన్నికల ప్రచారంలో ఈ పదాలు వాడొద్దు
– స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో చంద్రబాబు, లోకేష్, బాలయ్య
– త్వరలోనే బాలకృష్ణ రూట్‌మ్యాప్ రెడీ
– రేపటి నుంచే లోకేష్ జిల్లాల పర్యటన
స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. బాబు ఇప్పటికే రాష్ట్రం మొత్తం కలియతిరుగుతూ ప్రచారం చేస్తుండగా.. త్వరలోనే బాలకృష్ణ కూడా సుడిగాలి పర్యటన చేసేందుకు రూట్‌మ్యాప్ తయారవుతోంది. ఇక ఏపీమంత్రి నారా లోకేష్ మార్చి 26వ తేదీ మంగళవారం నుంచి ఎన్నికల ప్రచారం కోసం జిల్లాల్లో పర్యటించనున్నారు. లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరితోపాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు.
– శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటన
– పలాస జూనియర్ కాలేజీలో ఎన్నికల ప్రచార సభ
– మందస మండలంలోనూ ప్రచారం చేయనున్న లోకేష్
– కొత్తూరు, పొత్తూరు సభలకు లోకేష్ హాజరు
నారా లోకేష్ మార్చి 26వ తేదీ మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత శ్రీకాకుళం జిల్లా పలాస గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. మందస మండలంలోనూ లోకేష్ ప్రచారం చేయనున్నారు. కొత్తూరు, పొందూరు మండలాల్లో నిర్వహించే సభల్లోనూ ఆయన పాల్గొంటారు. అనంతరం విజయనగరం జిల్లా తెర్లాం మండలంలో లోకేష్ ఎన్నికల సభలో ప్రసంగిస్తారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయని సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికార ప్రతినిధులను టీడీపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చింది. ఇటీవలే టీడీపీలో చేరిన వంగవీటి రాధాకు స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు దక్కింది. టీడీపీ సినీయర్ నేతలు యనమల రామకృష్ణుడు, సుజానా చౌదరి కూడా అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహిస్తారు. సినీ రంగానికి చెందిన పార్టీ నేతలు మురళీమోహన్, దివ్యవాణి, అంబికా కృష్ణ, రేవతితోపాటు ఇతర సినీ ఆర్టిస్టులు ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
టీడీపీ స్టార్ క్యాంపెయ్‌నర్‌లు వీళ్లే:
నారా చంద్రబాబునాయుడు
యనమల రామకృష్ణుడు
నారా లోకేష్, మురళీమోహన్
నందమూరి బాలకృష్ణ
సుజనాచౌదరి
ఫరూక్
వర్ల రామయ్య
జూపూడి ప్రభాకర్
నాగుల్ మీరా
వంగవీటి రాధా
లంకా దినకర్
కోటేశ్వరరావు
పంచుమర్తి అనురాధ
సినీ నటి దివ్యవాణి
బుద్ధా వెంకన్న
పోతుల, గోవిందరెడ్డి
బీటీ నాయుడు
దువ్వారపు రామారావు
ఆనంద్ సూర్య
అంబికాకృష్ణ
అశోక్ బాబు
విజయభారతి
రేవతి
రామాంజనేయులు
Read Also : పవన్‌కు పృథ్వీ వార్నింగ్: పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు