హిందూపురంలో బాలకృష్ణను అడ్డుకున్న వైసీపీ నేతలు..తోపులాట..ఉద్రిక్తత

అనంతపురం హిందూపూర్ లో పర్యటిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించినందుకు.. సొంత నియోజకవర్గం అయిన హిందూపురంలో అధికార పక్ష వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. అధికార వికేంద్రీకరణకు ఎందుకు అడ్డుపడుతున్నారనీ..రాయలసీమకు అన్యాయం చేసే టీడీపీ నాయకులకు పర్యటించే హక్కు లేదని నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు.
రాయలసీమ ద్రోహి బాలకృష్ణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అమరావతిలో మాత్రమే ఎందుకు అభివృద్ధి కోరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటును వ్యతిరేకిస్తున్న బాలకృష్ణ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బాలకృష్ణ కాన్వాయ్‌ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఎమ్మెల్యే బాలయ్యకు టీడీపీ కార్యకర్తలు భారీగా ఘటనా స్థలానికి చేరుకుని బాలయ్య వాహనాన్ని అడ్డువైసీపీ నేతలను..కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు కల్పించుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొడుతుండటంతో ఉద్రిక్తత నెలకొంది.