TDP రేసుగుర్రాలు : 22 మంది ఎంపీ అభ్యర్థులు ఖరారైనట్లేనా?

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అభ్యర్ధులను ఎంపిక చేయడంలో వేగం పెంచింది. అసెంబ్లీ, పార్లమెంటుకు పోటీ చేసే వారిని ప్రకటిస్తుంది. అధికారికంగా బయటకు ప్రకటించనప్పటికీ, ఇప్పటికే అభ్యర్ధులకు వారి సీటుపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. నమ్మదగిన వర్గాల వారి సమాచారం ప్రకారం.. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు పార్లమెంటు స్థానాలను మినహాయించి 22 లోక్ సభ సీట్లకు సంబంధించి అభ్యర్థు ఖరారైనట్లు తెలుస్తుంది.
దాదాపు ఖరారయిన తెదేపా లోక్ సభ అభ్యర్దులు:-
1. శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు
2. విజయనగరం – అశోక్ గజపతిరాజు
3. అమలాపురం – హరీశ్ మాధుర్
4. విజయవాడ – కేశినేని నాని
5. కడప – ఆదినారాయణ రెడ్డి
6. గుంటూరు – గల్లా జయదేవ్
7. నంద్యాల – ఎస్పీ వై రెడ్డి కుటుంబ సభ్యులు
8. బాపట్ల – శ్రీరామ్ మాల్యాద్రి
9. నరసరావుపేట – రాయపాటి సాంబశివరావు/ రాయపాటి రంగారావు
10. విశాఖపట్నం – భరత్(బాలకృష్ణ రెండవ అల్లుడు)
11. కాకినాడ – చలమలశెట్టి సునీల్
13. రాజమండ్రి – బొడ్డు భాస్కర రామారావు
14. అనకాపల్లి – సబ్బం హరి
15. అరకు – కిషోర్ చంద్రదేవ్
16. కర్నూల్ – కోట్ల సూర్యప్రకాష్
17. అనంతపురం – జేసి పవన్ రెడ్డి
18. రాజంపేట -అన్నయ్యగారి సాయిప్రతాప్
19. ఓంగోలు – నండూరి సాంబశివరావు
20. మచిలిపట్నం – కొనకళ్ళ నారాయణ
21. హిందుపూర్ – నిమ్మల క్రిష్టప్ప
22. ఏలూరు – బోళ్ళ రాజీవ్.
ఇప్పటివరకు వీరి పేర్లను తెలుగుదేశం ఖరారు చేయగా.. వారికి కూడా దీనిపై సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు స్పష్టం చేయని మూడు పార్లమెంటు సీట్లను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.