కేసీఆర్ యాగం : ఎర్రవల్లిలో చకచక ఏర్పాట్లు

  • Published By: madhu ,Published On : January 20, 2019 / 02:27 AM IST
కేసీఆర్ యాగం : ఎర్రవల్లిలో చకచక ఏర్పాట్లు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరో యాగం చేసేందుకు సిద్ధమౌతున్నారు. గతంలోనే పలు యాగాలు నిర్వహించిన కేసీఆర్…అధికారంలోకి వచ్చిన తరువాత మరో యాగం చేయాలని నిర్ణయించారు. జనవరి 21 నుండి జనవరి 25వ తేదీ వరకు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జరిగే యాగానికి సంబంధించి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగం శృంగేరి పీఠం ఆధ్వర్యంలో జరుగనుంది. గతంలో వీరి ఆధ్వర్యంలోనే ఆయుత చండీయాగం జరిగింది. 
శృంగేరి పీఠం
శృంగేరి పీఠం నుండి పండితులు ఫణిశశాంక శర్మ, గోపికృష్ణల నేతృత్వంలో యాగాన్ని నిర్వహించనున్నారు. యాగశాలతో పాటు 27 హోమ గుండాలను ఏర్పాటు చేస్తున్నారు. యాగంలో పాల్గొనేందుకు 200 మంది రుత్విక్కులు జనవరి 19వ తేదీ శనివారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. వీరు బస చేయడానికి ఫాం హౌస్ ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. వీరితో పాటు 10 మంది పండితులు కూడా యాగంలో పాల్గొననున్నారు. యాగం వద్ద పలు ఆంక్షలు విధించిన పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.