ఆంధ్రా ఆదర్శ రైతుకు ఫోన్‌ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

ఆంధ్రా ఆదర్శ రైతుకు ఫోన్‌ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

Updated On : December 20, 2020 / 1:39 PM IST

CM KCR phoned Andhrapradesh ideal farmer : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృష్ణా జిల్లాకు చెందిన ఆదర్శ రైతు పాల ప్రసాదరావుకు ఫోన్‌ చేశారు. ఘంటసాల పాలెంకు చెందిన ప్రసాదరావు ఆధునిక సీడ్రిల్‌ యంత్రాలతో వేద పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌… పాల ప్రసాదరావుకు ఫోన్‌ చేసి సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

35 ఎకరాల్లో సీడ్రిల్‌ పద్ధతిలో వరి సాగుచేసి అధిక దిగుబడి సాధిస్తున్నట్టు కేసీఆర్‌ దృష్టికి తెచ్చారు. ఎకరానికి 40 నుంచి 45 బస్తాల దిగుబడి వస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.

కారు పంపిస్తానని ప్రసాదరావుకు చెప్పిన కేసీఆర్‌… తెలంగాణలో వ్యవసాయ విధానాన్ని పరీశీలించాలని కోరారు. తన నివాసంలో ఆతిధ్యానికి కూడా కేసీఆర్‌ ఆహ్వానించారని ప్రసాదరావు చెప్పారు.