శ్రీవారి కళ్యాణోత్సవం భక్తులకు టీటీడీ షాక్ : అదనంగా డబ్బులిస్తేనే ప్రసాదం

తిరుమలలో శ్రీవారి ఆర్జితసేవల్లో ఒకటైన కళ్యాణోత్సవం చేయంచుకోవాలనుకునే భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. శ్రీవారి కళ్యాణోత్సవం టిక్కెట్లపై భక్తులకు ఇప్పటి వరకూ టీటీడీ 2 పెద్ద పెద్ద లడ్డూలను, 5 చిన్న లడ్డూలు, 2 వడలను ఉచితంగా ఇచ్చేది. కానీ ఇకనుంచి వాటిని ఎత్తివేసింది. వాటికి రూ.600లు చెల్లిస్తేనే వాటిని ఇస్తామంటోంది. చిన్నా పెద్దవి మొత్తం ఏడు లడ్డూలుగానీ, వడలు గానీ ఇవ్వకుండా కేవలం రెండు చిన్న లడ్డూలు మాత్రం ఇచ్చి సరిపెడుతోంది. 5 చిన్న లడ్డూలు, 2 వడలను ఉచితంగా ఇచ్చేది. కానీ ఇకనుంచి వాటిని ఎత్తివేసింది. అవి కావాలంటే వాటికి అదనంగా రూ.600లు చెల్లిస్తేనే వాటిని ఇస్తామంటోంది.
దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఆశతో ఆకాంక్షతో శ్రీవారి కళ్యాణోత్సం చేయించుకునే భక్తులకు ఇలా శ్రీవారి ప్రసాదం ఇచ్చే విషయంలో కోతలు విధించటంపై తీవ్రంగా మండిపడుతున్నారు. కానీ టీటీడీ భక్తుల మనోభావాలను పట్టించుకోవటంలేదు. దీంతో భక్తులు కూడా చేసేదేమీ లేక పెద్ద లడ్డూలు, వడలకు రూ.600లు చెల్లించి కొనుక్కుంటున్నారు వెంకన్న భక్తులు.