8 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం: ఛిద్రమైన బిడ్డను చూసి తల్లి వేదన

  • Published By: veegamteam ,Published On : February 27, 2020 / 04:45 AM IST
8 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం: ఛిద్రమైన బిడ్డను చూసి తల్లి వేదన

Updated On : February 27, 2020 / 4:45 AM IST

ఆడబిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలు..అత్యాచారాల పర్వం ఆగటంలేదు. ఎన్ని చట్టాలు వచ్చినా కామాంధుల ఎన్ కౌంటర్లు జరిగినా మనుష్యుల్లో మాత్రం మృగత్వం బుసలుకొడుతూనే ఉంది. కామంతో కళ్లు మూసుకుపోయిన మొత్తం ముగ్గురు మృగాళ్లు అన్నెం పున్నెం ఎరుగని..పసి ఛాయలు వీడన ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి తెగబడ్డారు.

దారుణ ఘటన కరీంనగర్ అంబేద్కర్ నగర్ లో బుధవారం (ఫిబ్రవరి 26,2020) రాత్రి చోటుచేసుకుంది. దీంతో బాధితురాలి తల్లి ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం..అత్యాచారం  కింద కేసు నమోదు చేసిన పోలీసులు సదరు నిందితులను అదులపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

కాగా గత కొంతకాలంలో బాధిత బాలికను బెదరించి వినీత్.. శ్రీనివాస్ లతో పాటు మరో బాలుడు కూడా ఆ అత్యాచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయం బైటకు చెబితే చంపేస్తామని బాలికను బెదిరిస్తు కొంతకాలంగా ఈ ముగ్గురు బాలికపై దారుణాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో ముగ్గురు మృగాళ్ల హింసను తట్టుకోలేని ఆ లేత శరీరం అనారోగ్యానికి గురైంది. దీంతో తల్లి ఏమైంది బిడ్డా అని అడిగేసరికి ఏం చెప్పాలో..ఎలా చెప్పాలో..అసలు తనపై జరుగుతున్న ఈ దారుణకాండ గురించి తెలిసీ తెలియన మాటలతో తల్లికి చెప్పింది.

దీంతో బిడ్డ దుస్థితికి పుట్టెడు దు:ఖంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. కానీ ఆ కామాంధుల గురించి ఇలా వదిలేయకూడదనుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం..అత్యాచారం  కింద కేసు నమోదు చేసిన పోలీసులు సదరు నిందితుల కోసం గాలించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.