అక్టోబర్ 14న ఖమ్మం జిల్లా బంద్

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి నిరసనగా ఆర్టీసీ జేఏసీ ఖమ్మం జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. సోమవారం(అక్టోబర్ 14,2019) బంద్ కు పిలుపు ఇచ్చింది. ఆర్టీసీ జేఏసీ

  • Published By: veegamteam ,Published On : October 13, 2019 / 10:28 AM IST
అక్టోబర్ 14న ఖమ్మం జిల్లా బంద్

Updated On : October 13, 2019 / 10:28 AM IST

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి నిరసనగా ఆర్టీసీ జేఏసీ ఖమ్మం జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. సోమవారం(అక్టోబర్ 14,2019) బంద్ కు పిలుపు ఇచ్చింది. ఆర్టీసీ జేఏసీ

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి నిరసనగా ఆర్టీసీ జేఏసీ ఖమ్మం జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. సోమవారం(అక్టోబర్ 14,2019) బంద్ కు పిలుపు ఇచ్చింది. ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్ కు విపక్షాలు మద్దతు తెలిపాయి.

ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మరణించాడు. హైదరాబాద్ డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం(అక్టోబర్ 13,2019) కన్నుమూశాడు. శ్రీనివాస్ రెడ్డి మృతితో కార్మికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రభుత్వ వైఖరి వల్లే కార్మికుడు చనిపోయాడని మండిపడ్డారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నెలకొన్న పరిణామాలాతోనే ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని కార్మికులు తెలిపారు. అక్టోబర్ 12న ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కుటుంబసభ్యులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే 90 శాతానికి పైగా శరీరం కాలిపోయింది. వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. శ్రీనివాస్ రెడ్డి మృతికి ప్రభుత్వమే కారణం అని కార్మికులు అంటున్నారు. 
 
ఖమ్మం జిల్లాలో కార్మికులు ఆందోళన చేపట్టారు. బస్సు డిపోల ఎదుట బైఠాయించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే..అడ్డుకోవడం సరికాదని కార్మికులు అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.