ఏపీ నుంచి 8మంది, తెలంగాణ నుంచి ఏడుగురు : టీటీడీ బోర్డుపై అధికారిక ఉత్తర్వులు

టీటీడీ బోర్డు సభ్యులను ఏపీ సర్కార్‌ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 28 మందితో టీటీడీ బోర్డును ఏర్పాటు చేశారు. ఇందులో 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌ అఫీషియో

  • Published By: veegamteam ,Published On : September 18, 2019 / 07:41 AM IST
ఏపీ నుంచి 8మంది, తెలంగాణ నుంచి ఏడుగురు : టీటీడీ బోర్డుపై అధికారిక ఉత్తర్వులు

Updated On : September 18, 2019 / 7:41 AM IST

టీటీడీ బోర్డు సభ్యులను ఏపీ సర్కార్‌ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 28 మందితో టీటీడీ బోర్డును ఏర్పాటు చేశారు. ఇందులో 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌ అఫీషియో

టీటీడీ బోర్డు సభ్యులను ఏపీ సర్కార్‌ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 28 మందితో టీటీడీ బోర్డును ఏర్పాటు చేశారు. ఇందులో 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌ అఫీషియో మెంబర్స్‌ ఉన్నారు. టీటీడీ బోర్డులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 8 మంది, తెలంగాణ నుంచి ఏడుగురు, తమిళనాడు నుంచి నలుగురు.. కర్నాటక నుంచి ముగ్గురు, మహారాష్ట్ర నుంచి ఒకరు, ఢిల్లీ నుంచి ఒకరిని సభ్యులుగా తీసుకున్నారు. ఏపీ నుంచి యు.వి.రమణమూర్తి రాజు, మల్లికార్జున రెడ్డి, పార్థసారథి.. పరిగెల మురళీకృష్ణ, వి.ప్రశాంతి, నాదెండ్ల సుబ్బారావు, డి.పి.అనంత.. చిప్పగిరి ప్రసాద్‌కుమార్‌కు చోటు దక్కింది. తెలంగాణ నుంచి జె.రామేశ్వరరావు, బి.పార్థసారథిరెడ్డి.. జి.వెంకటభాస్కర రావు, మూరంశెట్టి రాములు, డి.దామోదర్‌ రావు.. పుత్తా ప్రతాప్‌రెడ్డి, కె.శివకుమార్‌కు చోటు లభించింది.