TTD ఖజానాకు 1,381 కిలోల బంగారం

తిరుమల శ్రీవారికి ఉన్న బంగారం అంతా ఇంతాకాదు..బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మండమంతా బంగారం. టన్నుల కొద్దీ ఖజానాలలో మూలుగుతోంది. ఇప్పుడు దీనికి తోడు మరో 1381 కిలోల బంగారం వచ్చి చేరుతోంది. ఇదిలా ఉండగా..తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో పోలీసులు తనిఖీలలో 1380 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)కి చెందినదే. దీంతో అటు ఈసీ అధికారులు..ఇటు పోలీసులు షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన పత్రాలు సరిగా లేకపోవటంతో దాన్ని సీజ్ చేసి..చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో భద్రపరిచారు.
తమిళనాడులో రెండ్రోజుల క్రితం ఈసీ అధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకున్న 1,381కిలోల బంగారం నేడు టీటీడీ ఖజానాకు చేరనుంది. టీటీడీకి చేరాల్సిన ఈ బంగారాన్ని చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో భద్రపరిచారు. గడువు ముగియడంతో బ్యాంకు అధికారులు టీటీడీకి అప్పగించేందుకు రెండు వాహనాల్లో బుధవారం బంగారాన్ని తరలించారు.
తమిళనాడులో ఎన్నికల సందర్భంగా తిరువళ్లూరు జిల్లా ఆవడి సమీపంలో వేపంపట్టు చెక్‌పోస్ట్ దగ్గర ఈసీ అధికారులు, పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో సంచలనం రేపింది. పోలింగ్ జరగనున్న క్రమంలో ఓటర్లకు పంచేందుకే వీటిని రాజకీయ పార్టీల నేతల భావించారు. కానీ ఆ బంగారం అంతా టీటీడీకి చెందినదని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్న వాహనాల్లో ఎటువంటి ఆధారాలు లేకపోవటంతో ఆ బంగారాన్ని తమిళనాడులోని పూందమల్లి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.
ఈ క్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు గురువారం (ఏప్రిల్ 18)న ఈసీ అధికారులను కలిసి నగలకు సంబంధించిన ఆధారాలు చూపించడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించి బంగారం విడుదలకు ఉన్నతస్థాయిలో పర్మిషన్స్ వచ్చినా కింది స్థాయి అధికారులు అందుబాటులో లేకపోవటంతో ఆలస్యమైంది. ఈ క్రమంలో అన్నీ అనుమతులు లభించటం..అంతా చక్కబడటంతో ఈ బంగారాన్ని శుక్రవారం (ఏప్రిల్ 19)న టీటీడీ ఖజానాకు జమచేస్తామని పీఎన్‌బీ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో టీటీడీ ఖజానాకు ఈ బంగారం చేరనుంది.