నేరెడ్ బ్యారేజ్ తీర్పు వెల్లడించిన వంశధార ట్రిబ్యునల్

శ్రీకాకుళం జిల్లా నేరెడ్ బ్యారేజ్ తీర్పును వంశధార ట్రిబ్యునల్ వెల్లడించింది. 106 ఎకరాల్లో ప్రహరీగోడ కట్టడానికి గతంలో అనుమతి ఇచ్చారు. ఆర్డర్ లో మార్పులు చేయాలని ఒడిశా ప్రభుత్వం ఇచ్చిన అప్లికేషన్ ను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది.
106 ఎకరాలకు జాయింట్ సర్వే నిర్వహించి మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించింది. డిసెంబర్ 30 లోగా పూర్తి చేయాలని ఒడిశా, ఏపీ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. విచారణను జనవరి 10కి వేసింది.