ఏపీలో వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు

అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు వసతి దీవెన, విద్యా దీవెన పథకాలపై దృష్టి పెట్టింది. వసతి దీవెన కింది ఏటా రెండు విడతల్లో 20 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది.

  • Published By: veegamteam ,Published On : January 21, 2020 / 06:18 PM IST
ఏపీలో వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు

Updated On : January 21, 2020 / 6:18 PM IST

అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు వసతి దీవెన, విద్యా దీవెన పథకాలపై దృష్టి పెట్టింది. వసతి దీవెన కింది ఏటా రెండు విడతల్లో 20 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది.

అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు వసతి దీవెన, విద్యా దీవెన పథకాలపై దృష్టి పెట్టింది. వసతి దీవెన కింది ఏటా రెండు విడతల్లో 20 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. విద్యా దీవెన పథకం కింది ఫీజుల మొత్తాన్ని రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీలో చెప్పారు. మిడ్‌ డే మీల్‌ కోడి గుడ్ల కొనుగోలుకు రివర్స్‌ టెండర్స్‌ వేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం విస్మరించడంతోనే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించారన్నారు. 

ఏపీ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు తీసుకొస్తున్నామని సీఎం జగన్ అసెంబ్లీలో వెల్లడించారు. గత ప్రభుత్వం మాదిరిగా తప్పులు చేయకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెట్టే ఆహార భోజనంలో మార్పులు చేశామని, రోజుకో రుచితో భోజనం పెడుతామన్నారు సీఎం జగన్. 2020, జనవరి 21వ తేదీ మంగళవారం అమ్మ ఒడి పథకంపై ఆయన మాట్లాడారు. 

పిల్లలకు ఇచ్చే ఏకైక ఆస్తి చదువు, నాణ్యమైన చదువును అందిస్తే..వాళ్లు ఉన్నతమైన స్థాయికి వెళుతారని సభలో తెలిపారు. గోరుముద్ద పేరిట మధ్యాహ్న భోజన పథకం అందిస్తామన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని కార్యక్రమం అమ్మ ఒడి. మధ్యాహ్న భోజన పథకానికి అదనంగా రూ. 344 కోట్లు ఖర్చవుతాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. 

నాణ్యతలో మాత్రం ప్రభుత్వం కఠినంగా ఉంటుందని, ఒక ఫోర్ లెవల్స్ సిస్టం‌ను ఇందులో తీసుకొస్తామన్నారు. పేరెంట్ కమిటీ నుంచి ముగ్గురిని ఎంపిక చేసి మధ్యాహ్న భోజన పథకం తీరుపై పరిశీలన చేయడం జరుగుతుందని చెప్పారు.