ఎన్నికల వేళ బీజేపీలో చేరిన ప్రముఖ సినీనటి

ఎన్నికల వేళ బీజేపీలో చేరిన ప్రముఖ సినీనటి

Updated On : February 25, 2021 / 2:49 PM IST

ఎన్నికలు వస్తోంటే.. సినిమా సెలబ్రిటీల హడావుడి కనిపించడం కొత్తేం కాదు.. నేమ్‌ని, ఫేమ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఎన్నికల సమయంలో సెలబ్రిటీలు ముందుంటారు. పార్టీలు కూడా పేరు తెచ్చుకునేందుకు పార్టీలలోకి ఆహ్వానిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా పశ్చిమ్‌ బంగాల్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు ప్రముఖులు.

ఇప్పటికే టీఎంసీకి చెందిన పలువురు నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. లేటెస్ట్‌గా ప్రముఖ బెంగాలీ నటి పాయల్‌ సర్కార్‌ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పశ్చిమ్‌ బంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలిప్‌ ఘోష్‌ సమక్షంలో పాయల్‌ సర్కార్‌ భాజపాలో చేరారు. మాజీ క్రికెటర్‌ అశోక్‌ దిండా కూడా బీజేపీలో చేరగా.. గతవారం ప్రముఖ బెంగాలీ నటుడు యశ్‌దాస్‌ గుప్తా కూడా బీజేపీలో చేరారు.

మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మాదిరిగానే ఇప్పుడు బెంగాల్ బిజెపి కూడా సినీ తారలతో అలంకరించేందుకు ప్రయత్నిస్తోంది. నటి పాయల్ సర్కార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీలో చేరగా.. నటుడు పాయెల్ సర్కార్ కోల్‌కతాలోనే బిజెపిలో చేరారు.