దసరా పండుగ రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారు?

  • Published By: veegamteam ,Published On : September 25, 2019 / 09:55 AM IST
దసరా పండుగ రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారు?

Updated On : September 25, 2019 / 9:55 AM IST

పాలపిట్ట అంటే శుభాలకు, విజయాలకు చిహ్నం అంటారు. తెలంగాణ ప్రజలు దసరా పండుగ రోజున ఈ పిట్టను చూస్తే ఎంతో అదృష్టం అని భావిస్తారు. దసరా వచ్చిందంటే జమ్మచెట్టు ఎలా గుర్తుకు వస్తుందో.. పాలపిట్ట కూడా అలాగే గుర్తుకువస్తోంది. దసరా పండుగను భారతదేశమంతటా ఘనంగా జరుపుకుంటారు. ఈ దసరానే విజయదశమి అని కూడా పిలుస్తారు.   

ఇక సాక్షాత్తు శ్రీరాముడే రావణుడితో యుద్ధానికి వెళ్లేముందు పాలపిట్ట దర్శనం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే విజయదశమి రోజున ఈ పిట్టని చూస్తే అంతా మంచి జరుగుతోందని ప్రజల నమ్మకం. అంతేకాదు పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలను ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా ఈ పాలపిట్ట కనిపించిందంట.. అప్పటినుంచి వారికి అన్నీ విజయాలు సిద్ధించాయని జనపదుల నమ్మకం. అందుకే  విజయదశమి రోజున పూర్వం మగవాళ్లు తప్సనిసరిగా అడవికి పోయి పాలపిట్టను చూసి ఇంటికి వచ్చేవారట. 

అందుకే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతోపాటు, కర్నాటక, ఒడిస్సా, బీహార్‌ రాష్ట్రలు పాలపిట్టను రాష్ట్ర పక్షిగా భావిస్తారు. ముఖ్యంగా తెలంగాణలో పాలపిట్టకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రకటించింది.