అత్యుత్సాహం : జగన్ హెలీప్యాడ్ వద్దకు దూసుకొచ్చిన అభిమానులు

అనంతపురం : జిల్లాలో వైసీపీ అభిమానులు అత్యుత్సాహం చూపారు. ఎన్నికల ప్రచారం కోసం సోమందేపల్లికి వచ్చారు. అభిమానులు జగన్ హెలీప్యాడ్ వద్దకు దూసుకొచ్చారు. దీంతో జగన్ పరుగు పరుగున వెళ్లి కారు ఎక్కారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి అభిమానులను అదుపు చేశారు. దీంతో అక్కడి ఉద్రిక్తత నెలకొంది.
ఏప్రిల్ 11న ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. విస్తృత ప్రచారం చేస్తున్నారు. రోడ్ షోలు, ప్రచార సభల్లో ప్రసంగిస్తున్నారు.