రుణమాఫీ హామీ టీడీపీది..తమది కాదు : అంబటి

  • Published By: madhu ,Published On : September 26, 2019 / 06:02 AM IST
రుణమాఫీ హామీ టీడీపీది..తమది కాదు : అంబటి

Updated On : September 26, 2019 / 6:02 AM IST

రుణమాఫీ చేస్తామనే హామీ టీడీపీది..తమది కాదన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. రుణమాఫీ ఆర్థిక భారమని ధైర్యంగా చెప్పిన వ్యక్తి జగన్ అని తెలిపారు. 
ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా టీడీపీకి బుద్ధి రాలేదని విమర్శించారు. సెప్టెంబర్ 26వ తేదీ గురువారం ఉదయం అంబటి మీడియాతో మాట్లాడారు. హామీలు ఇచ్చి నిలబెట్టుకోనిది టీడీపీ ప్రభుత్వానిదన్నారు.

రూ. 87 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి..రూ. 24 వేల కోట్లు రద్దు చేస్తామన్నారు. అయినా..అవన్నా రద్దు చేశారా అంటే లేదు..కేవలం రూ. 15 వేలు రద్దు చేసినట్లుగా చెప్పారన్నారు. ఇంకా మిగిలిన రుణమాఫీ డబ్బును వైసీపీ ప్రభుత్వం తీర్చాల్సిందేనంటున్నారని తెలిపారు. ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వ చర్యలను సమర్థించాల్సింది పోయి..చంద్రబాబు విషం కక్కుతున్నారని అన్నారు. రివర్సింగ్ టెండరింగ్ విధానంలో ప్రజాధనం ఎంతో మిగిలిందని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వం అయినా చేసిందా  అని ప్రశ్నించారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ విషయంలో కూడా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు అంబటి.

సంవత్సరానికి రూ. 2 వేల 500 కోట్లు దుర్వినియోగం అయ్యే విధంగా చేసుకుని పీపీఏ అగ్రిమెంట్లు చేసుకుని…జల్సా చేస్తున్న తండ్రి, కొడుకులకు బుద్ధి చెప్పే కార్యక్రమమన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు. సచివాలయాల పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తే..లీకులు..అంటూ ఏవో విమర్శలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి విమర్శించారు.