వైఎస్ఆర్ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ : ‘అన్న పిలుపు’తో లేఖలు

ఫ్రభావం చూపగల తటస్థులతో సమావేశం
సలహాలు, సూచనలు కోరనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత
ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రశాంత్ కిశోర్ టీమ్!
విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. 2019లో జరిగే ఎన్నికల్లో అధికారం చేజిక్కించడం కోసం పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఆ పార్టీకి సంబంధించిన వ్యూహకర్తలు బిజీ బిజీ అయిపోతున్నారు. రాష్ట్రంలో ఉన్న తటస్థ ఓటర్లను తమ వైపు వచ్చే విధంగా ప్లాన్స్ వేస్తున్నారు. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 13 జిల్లాల్లో తటస్థ ఓటర్లను ప్రభావితం చేయగల వ్యక్తులకు లేఖలు రాయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ చీఫ్ జగన్ నిర్ణయించారు. ‘అన్న పిలుపు’ అనే పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రాంతాలో తాను చూసిన సమస్యలను ఈ లేఖలో జగన్ వారికి వివరించనున్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి కలిసి రావాలనీ, సలహాలు, సూచనలు అందించాలని కోరనున్నారు.
జగన్ లేఖలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించుకున్న వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీం…ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసినట్లు టాక్. ఇప్పటికే తటస్థంగా ఉన్న వ్యక్తుల వివరాలు సేకరించినట్లు…జగన్ వీరందరికీ లేఖలు రాయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనంతరం జగన్ స్వయంగా వారందరినీ కలుసుకోనున్నారు. వీరందరినీ కలవడం..ప్రజా సమస్యలపై చర్చించడం..సూచనలు..సలహాలు తీసుకోవడం మూలంగా పార్టీ విజయం మరింత మెరుగయ్యే అవకాశాలున్నట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరి ఆ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితం వస్తుందో వెయిట్ అండ్ సీ…