గాజు సీసాతో గొంతు కోసుకున్న యువకుడు

నల్గొండ జిల్లా హాలియాలో దారుణం జరిగింది. శ్రీను అనే యువకుడు నడిరోడ్డుపై గాజు సీసాతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన స్థానికులంతా వెంటనే స్పందించారు. అతన్ని అడ్డుకునే యత్నం చేశారు. దగ్గరకొస్తే మిమ్మల్ని కూడా పొడుస్తానంటు బెదిరించటంతో వారు వెనక్కి తగ్గారు. వెంటనే శ్రీను గాజు సీసాతో గొంతు కోసుకున్నాడు. మరోసారి కోసుకోబోతుండగా వెంటనే స్థానిక యువకులు గాయాలతో రోడ్డుపై పడి ఉన్న శ్రీనుని అడ్డుకున్నారు.
బ్రిలియంట్ స్కూల్ సమీపంలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శ్రీనును ఆసుపత్రికి జిల్లా కేంద్రం ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం శ్రీనుకు ఎటువంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. శ్రీను ఆత్మహత్యానికి గల కారణాల గురించి విచారణ చేపట్టారు.