కౌలు రైతులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు తీపి కబురు అందించింది. వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు వర్తింప జేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

  • Published By: veegamteam ,Published On : November 26, 2019 / 12:01 PM IST
కౌలు రైతులకు శుభవార్త

Updated On : November 26, 2019 / 12:01 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు తీపి కబురు అందించింది. వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు వర్తింప జేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు తీపి కబురు అందించింది. వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు వర్తింప జేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అటవీ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసింది. రైతు సంతానం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా కూడా రైతు భరోసా వర్తిస్తుందని తెలిపింది. ఒకవేళ రైతు మరణిస్తే భార్యకు వైఎస్సార్‌ రైతు భరోసా సాయం అందించనుంది. ఆ తర్వాతి ఏడాది ఆ భూమి వెబ్ ల్యాండ్ లో ఎవరి పేరుమీద ఉంటే వారికి రైతు భరోసా ఇచ్చేలా మార్పులు చేసింది. రైతు భరోసా నుంచి ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ రైతు భరోసాకు సంబంధించి కొన్ని సవరణలు చేసింది. ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించింది. రైతు కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు, టాక్స్ కట్టేవారు ఉన్నా పథకానికి రైతు అర్హులని తెలిపింది. అర్హులైన రైతు మరణిస్తే చట్ట ప్రకారం ఆ కుటుంబంలోని అర్హులకు ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ తర్వాతి ఏడాది ఆ భూమి వెబ్‌ల్యాండ్‌లో ఎవరి పేరుమీద ఉంటే వారికి రైతు భరోసా ఇచ్చేలా మార్పులు చేస్తూ జీవో జారీ చేసింది.

వైఎస్సార్‌ రైతు భరోసాకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించేందుకు గడువును రెండు వారాల క్రితమే పెంచింది. డిసెంబర్ 15 వరకు దరఖాస్తుకు అవకాంశం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా గడువు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది.