అమెరికాలో కాల్పుల అలజడి.. నలుగురి మృతి.. ఈ ఏడాదిలో 403వ ఘటన
చికిత్స పొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. అలబామా రాష్ట్రంలో పలువురు దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో స్థానికులకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
బర్మింగ్‌హామ్‌లోని ఫైవ్ పాయింట్స్ సౌత్ డిస్ట్రిక్ట్‌లో గత రాత్రి పలువురు దుండగులు అక్కడి చాలా మంది వ్యక్తులపై కాల్పులు జరిపారని పోలీసు అధికారి ట్రూమాన్ ఫిట్జ్‌గెరాల్డ్ మీడియాకు తెలిపారు. కాల్పులు జరిపిన వెంటనే ముగ్గురు బాధితులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పారు.
చికిత్స పొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇప్పటివరకు నిందితులు ఎవరూ తమకు చిక్కలేదని, కాల్పులకు సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే తమకు చెప్పి విచారణకు తోడ్పడాలని అన్నారు. పలు ఏజెన్సీలు కలిసి విచారణలో పాల్గొంటున్నాయని వివరించారు. గన్ వయలెన్స్ ఆర్కైవ్ ప్రకారం అమెరికాలో ఈ ఏడాది జరిగిన 403వ సామూహిక కాల్పుల ఘటనలు జరిగాయి.
Priyanka Jawalkar : న్యూయార్క్ నగరంలో ప్రియాంక జవాల్కర్ స్టైలిష్ పోజులు..