US elections 2024: కొనసాగుతున్న పోలింగ్‌.. డిక్స్‌విల్లే నాచ్‌ ఫలితం వచ్చేసింది..

న్యూహ్యాంప్‌షైర్‌ లోని డిక్స్‌విల్లే నాచ్‌లో మొత్తం ఆరుగురు ఓటర్లు మాత్రమే ఉంటారు.

US elections 2024: కొనసాగుతున్న పోలింగ్‌.. డిక్స్‌విల్లే నాచ్‌ ఫలితం వచ్చేసింది..

Updated On : November 5, 2024 / 7:57 PM IST

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రట్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అమెరికాలోని రాష్ట్రాల్లో పోలింగ్‌ సమయాలు వేర్వేరుగా ఉంటాయి.

కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైన కొన్ని గంటలకే అక్కడి ఓ చిన్న కౌంటీలో కౌంటింగ్‌ సైతం పూర్తి అయింది. న్యూహ్యాంప్‌షైర్‌ లోని డిక్స్‌విల్లే నాచ్‌లో మొత్తం ఆరుగురు ఓటర్లు మాత్రమే ఉంటారు. అందులో కమలా హారిస్‌కు మూడు, డొనాల్డ్‌ ట్రంప్‌నకు మూడు ఓట్లు వచ్చాయి. అమెరికా-కెనడా సరిహద్దులో డిక్స్‌విల్లే నాచ్‌ ఉంటుంది.

ఎలక్షన్‌ డే ప్రారంభమైన అనంతరం వారందరూ స్థానిక పోలింగ్‌ కేంద్రం వద్ద జాతీయ గీతాన్ని పాడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆరుగురూ ఓటేసిన 15 నిమిషాల అనంతరం ఫలితాలు ప్రకటించారు. 1960 నుంచి అర్ధరాత్రి అక్కడి వారు ఓటు హక్కు వినియోగించుకునే సంప్రదాయం ఉంది.

అందుకే కులగణన చేస్తున్నాం: హైదరాబాద్‌లో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు