అందుకే కులగణన చేస్తున్నాం: హైదరాబాద్‌లో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు

"ప్రపంచంతో పోలిస్తే.. మన దేశంలో నే అసమానతలు ఎక్కువ ఉన్నాయి" అని రాహుల్ గాంధీ అన్నారు.

అందుకే కులగణన చేస్తున్నాం: హైదరాబాద్‌లో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు

Rahul Gandhi

Updated On : November 5, 2024 / 7:33 PM IST

హైదరాబాద్‌లోని బోయిన్ పల్లి, గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కులగణన సంప్రదింపుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నడానికి వచ్చిన రాహుల్ గాంధీ కేంద్ర సర్కారుపై మండిపడ్డారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. “భారత దేశంలో కుల వ్యవస్థ చాల బలంగా ఉంది. అగ్రకులాలకు ఎప్పుడూ కులవ్యవస్థ కనిపించదు.

కుల గణన ద్వారా నష్టం జరగకుండా చూడవచ్చు. కుల వ్యవస్థ అన్ని రంగాల్లో ఉంది. రాజకీయ, న్యాయ వ్యవస్థలో కూడా కులం ఉంది. కుల వ్యవస్థ వలన కొంత మంది ఆత్మ విశ్వాసం దెబ్బతీస్తుంది. ఎంత మంది బీసీలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు.. జ్యూడిషియల్ వ్యవస్థ, పాలన వ్యవస్థ లో ఉన్నారో తేలాలి. కులవ్యవస్థ వల్ల లబ్ధిపొందే వారే కులగణనను వ్యతిరేకిస్తున్నారు.

కులవ్యవస్థ గురించి మోదీ నోరు విప్పడం లేదు. ఎంత మంది ఎస్సీలు, ఎస్టీలు కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారో తేలాలి. అందుకే కులగణన జరగాలని కోరుతున్నాం. 50 శాతం రిజర్వేషన్ల మార్క్ ను ఎత్తేస్తాం. తెలంగాణలో కులగణన చేపట్టడం సంతోషంగా ఉంది. తెలంగాణ నాయకత్వాన్ని నేను అభినంధిస్తున్నా. కులగణన ద్వారా భవిష్యత్ తరాల అభివృద్ధికి బాటలు వేయొచ్చు” అని రాహుల్ గాంధీ అన్నారు.

“ప్రపంచంతో పోలిస్తే.. మన దేశంలో నే అసమానతలు ఎక్కువ ఉన్నాయి. టైటానిక్ పడవ ను తయారు చేసిన వాళ్లు ఈ పడవ ప్రపంచంలోనే అత్యంత పెద్దది.. ఇది ఎన్నటికీ మునిగిపోదు అనుకున్నారు. కానీ సముద్రంలో ఒక మంచు కొండను ఢీ కొని 20 నిమిషాల్లో మునిగిపోయింది.

ఎందుకు అంటే సముద్రంలో ఆ మంచు కొండ 10 శాతం మాత్రమే బయటకు కనిపించింది. అలాగే, నేడు సమాజంలో కుల వివక్ష కూడా లోతుగా బలంగా ఉంది. దేశంలో కుల వివక్ష అనుభవించే వాళ్లకు ఆ బాధ తెలుస్తుంది. కులగణన చేస్తే ఏ కులం వాళ్లు ఎంత మంది ఉన్నారు?

ఎవరు పేదలు, ఎవరికి ఏముంది? అని తెలుసుకోవాలి. మేము దేశాన్ని చీల్చాలని ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. దేశంలో సంపదను ఎవరి వాటా వారికి ఇవ్వడం దేశాన్ని చీల్చడమా? తెలంగాణలో కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయం” అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ.. “నేను 2013 నుంచి కాంగ్రెస్ వ్యతిరేకిని, కానీ, రాహుల్ గాంధీని కలిసిన తర్వాత నా అభిప్రాయం మార్చుకున్నాను. దేశ వ్యాప్తంగా కులగణన జరపాలి. కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది” అని చెప్పారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… కులగణన చేస్తామని మ్యానిఫెస్టోలో చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేస్తున్నాం.
కులగణన కోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఫీల్డ్ స్టడీ చేశాం. లోకల్ బాడీ ఎన్నికల్లో జనాభా లెక్కల ప్రకారం బీసీల రిజర్వేషన్ పెంచుతున్నాం. దేశ జనాభా లెక్కలు చేసిన తర్వాతనే నియోజకవర్గాల రిజర్వేషన్ చేయాలి” అని అన్నారు.

Manda Krishna Madiga : పవన్ నోట ఆ మాటలు దురదృష్టకరం.. మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం!