Manda Krishna Madiga : పవన్ నోట ఆ మాటలు దురదృష్టకరం.. మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం!

Manda Krishna Madiga : పవన్ చేసిన వ్యాఖ్యలను మంద కృష్ణ మాదిగ తప్పుబట్టారు. హోంమంత్రిని అంటే.. ప్రభుత్వాన్ని అన్నట్లే.. సీఎంను అన్నట్టేనన్నారు.

Manda Krishna Madiga : పవన్ నోట ఆ మాటలు దురదృష్టకరం.. మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం!

Manda Krishna Madiga Reacts On Pawan Kalyan Comments

Updated On : November 5, 2024 / 7:24 PM IST

Manda Krishna Madiga : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కామెంట్లపై మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ నోటి నుంచి ఆ విధంగా రావడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు. పిఠాపురం వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. పవన్ మీ అభిప్రాయం ఎలా ఉన్నా.. లోపల మాట్లాడాలని హితువు పలికారు.

దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రిపై పవన్ ఇలా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. హోంమంత్రిని అంటే.. ప్రభుత్వాన్ని అన్నట్లే.. అంటే.. సీఎంను అన్నట్టే నన్నారు. హోంమంత్రిని అనడమే కాదు.. సీఎంను కూడా పవన్ అన్నట్టే నని మందకృష్ణ మాదిగా విమర్శించారు.

పవన్ మాటలు ప్రభుత్వానికే నష్టం :
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మంత్రి ఇవ్వనపుడు ఇదేం సామాజిక న్యాయమని ఆయన ప్రశ్నించారు. మాట్లాడే సమయం వచ్చినపుడు మేం అన్ని విషయాలు మాట్లాడతామని తెలిపారు. కేబినెట్ అంటే కుటుంబమన్న మంద కృష్ణ.. పవన్ మాటలు ప్రభుత్వానికి నష్టమని, తమ కులానికి అవమానంగా పేర్కొన్నారు.

రేపు పవన్ మాటలు ఆయన శాఖకు కూడా వర్తిస్తాయని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలోనే పవన్ పట్ల తాము అసంతృప్తిని వ్యక్తం చేశామన్నారు. జనసేన అందరి‌పార్టీనా కాదా..? కమ్మ కాపులే కాదు అందరూ జనసేనకు ఓట్లేశారని చెప్పారు. పవన్ ‌కాపులకు పెద్దన్న‌ఏమో.. మాకు కాదన్నారు.

అదే మాట మర మంత్రి అంటే ఎలా? :
జన‌సేనకు కేటాయించిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంకో‌ సీటు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. రిజర్వేషన్ మూడు సీట్లు‌ మాలలకు ఇచ్చారని మందకృష్ణ తెలిపారు. హోం మంత్రి అనిత విషయంలో పవన్.. ఇదే‌విధంగా‌ తన శాఖ సరిగా చేయలేదని నీ శాఖను నేను తీసుకుంటానని మరో మంత్రి అంటే ఎలా ఉంటుందో చెప్పాలన్నారు. పవన్ వ్యాఖ్యలు ప్రభుత్వానికి నష్టమని, లా‌ అండ్ ఆర్డర్ ఫెయిల్‌ అంటే.. సీఎం చంద్రబాబును అన్నట్లు కాదా? అని మందకృష్ణ మాదిగ విమర్శలు గుప్పించారు.

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ప్రక్రియ ‌వెంటనే అమలు చేయాలి :
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ప్రక్రియ ‌వెంటనే అమలు చేయాలని చంద్రబాబును కలిసి‌ విజ్ఞప్తి చేశామని మంద కృష్ణ మాదిగా తెలిపారు. గంట సేపు సమయం ఇచ్చి తమ అభిప్రాయాలను సీఎం చంద్రబాబు తెలుసుకున్నారని, దేశంలో ఎస్సీ వర్గీకరణకు మొదట‌చట్టం చేసి అమలు‌చేసింది చంద్రబాబుని మంద కృష్ణ గుర్తు చేశారు. ఇది చట్ట బద్దమా కాదా అన్న అంశంపై సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ కూడా ‌ధృవీకరించినట్టు తెలిపారు.

ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేసిన మొదటి సీఎం చంద్రబాబు :
2000 చట్టంలో పంజాబ్, తమిళ నాడు అమలు చేస్తున్నాయని, హర్యానా ప్రభుత్వం కూడా అమలు ప్రక్రియ ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. తెలంగాణలో మంత్రులతో కమిటీ వేశారని, రిటైడ్ జడ్జితో‌ కమీషన్ వేసినట్టు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేసిన ఫస్ట్ సీఎం ‌చంద్రబాబుగా పేర్కొన్నారు. అందరికంటే ముందు అమలు చేసిన మీరు ఇప్పుడు అమలు జేయడంలో వెనుకబడవద్దని చంద్రబాబును కోరినట్టు తెలిపారు.

నెలరోజుల్లో కమీషన్ వేస్తామన్న చంద్రబాబు :
అందుకు చంద్రబాబు కూడా అంగీకరించినట్టు చెప్పారు. త్వరలోనే కమీషన్ వేస్తామని సీఎం హామీ ఇచ్చారని, అంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వవద్దని కోరినట్టు తెలిపారు. మెగా‌డీఎస్సీ అంత వరకు ఇవ్వద్దని కోరినట్టు తెలిపారు.

కమీషన్ రిపోర్టు వచ్చేంతవరకు నోటిఫికేషన్ ఇవ్వమని చంద్రబాబు హామీ ఇచ్చారని ఇదిమాకు గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కలను పరిగణలోనికి తీసుకొని కమీషన్ నివేదిక వచ్చేట్లు చూడాలని కోరామని, అయితే.. నెల రోజు ల్లో‌ కమీషన్ వేస్తామని చంద్రబాబు హామీఇచ్చారని మంద కృష్ణ మాదిగ చెప్పారు.

గతంలో 32 అంశాల‌తో వినతి‌ పత్రం ఇచ్చామన్న ఆయన అన్ని విభాగాల్లో మాదిగలకు భాగస్వామ్యం ఉండాలని కోరినట్టు తెలిపారు. టీడీపీ, బీజేపి, జనసేనతో పాటు‌ కూటమి గెలుపు కోసం ఎంఆర్పీఎస్ కార్యకర్త లు పనిచేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వంలో మేం భాగస్వామ్యం కాదని, కాబట్టి మాదిగలను పట్టించుకోవాలని కోరినట్టు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు.

Read Also : HYD Traffic Police : వాహనదారులకు అలర్ట్.. బండి బయటకు తీస్తే హెల్మెట్ ఉండాల్సిందే.. లేదంటే భారీ ఫైన్..!