HYD Traffic Police : వాహనదారులకు అలర్ట్.. బండి బయటకు తీస్తే హెల్మెట్ ఉండాల్సిందే.. లేదంటే భారీ ఫైన్..!
HYD Traffic Police : నగరంలో బైకు బయటకు తీస్తే ఇకపై హెల్మెట్ తప్పనిసరి ఉండాల్సిందే.. నేటి నుంచే నిబంధనలను నగర పోలీసులు అమలు చేయనున్నారు.

HYD Traffic Police Special Drive
HYD Traffic Police Special Drive : ట్రాఫిక్ ఉల్లంఘనలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపించబోతున్నారు. వాహనదారుల భద్రత దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ రోజు (నవంబర్) 5 నుంచి హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు.
నగరంలో బైకు బయటకు తీస్తే ఇకపై హెల్మెట్ తప్పనిసరి ఉండాల్సిందే.. నేటి నుంచే నిబంధనలను నగర పోలీసులు అమలు చేయనున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. 200 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రాంగ్ సైడ్, రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపినా సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా రాంగ్ సైడ్, రాంగ్ రూట్ వెళితే ఏకంగా రూ. 2వేలు జరిమానా విధించనున్నారు.
మరోవైపు సిటీలోని రోడ్డు ప్రమాదాలపై ఇప్పటికే హైకోర్టు సీరియస్ అయింది. పబ్‌ల ఎదుట డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి నిబంధన అమల్లోకి తెచ్చామని అడిషనల్ సీపీ ట్రాఫిక్, విశ్వప్రసాద్ తెలిపారు. బైక్ నడిపే వాళ్ళలో నూటికి నూరు శాతం మంది హెల్మెట్ ధరించి వాహనం నడిపేలా లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
ఇప్పటినుంచి స్పెషల్ డ్రైవ్‌లు పెట్టి నిబంధనలు అమలు చేస్తామన్నారు. అలాగే, రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపితే రూ. 2 వేలు ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న టూ వీలర్స్‌లో ఎక్కువమంది హెల్మెట్ లేకపోవడం వల్లే చనిపోతున్నారని అన్నారు. ప్రమాదాలను నివారించేందుకే నిబంధనలు కఠినతరం చేశామని అదనపు సీపీ విశ్వ ప్రసాద్ తెలిపారు.
Read Also : హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. బావర్చీ బిర్యానీ తింటూ మాట్లాడుకుందామని హోటల్‌లో విద్యార్థుల వెయిటింగ్