Viral Video: ఆ సంగీతకారుడికి ఒకే ఒక ప్రేక్షకురాలు ఈ పాప.. అబ్బురపరుస్తున్న వీడియో
అదో మెట్రోస్టేషన్.. అందరూ రైలు కోసం పరుగులు తీస్తూ ఉన్నారు. వారి మధ్య సబ్ వేలో ఓ సంగీతకారుడు గిటారు వాయిస్తున్నాడు. ఆయనను ఎవరూ పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. అయితే, ఓ పాప మాత్రం ఆయన సంగీతం, పాటను వింటూ ఆయన వద్దే ఆగిపోయింది. దీంతో తనకు దొరికిన ఒకే ఒక ప్రేక్షకురాలి కోసం ఆ సంగీతకారుడు పాట పాడుతూ, గిటారు వాయిస్తూ ఉండిపోయాడు.

Viral Video
Viral Video: అదో మెట్రోస్టేషన్.. అందరూ రైలు కోసం పరుగులు తీస్తూ ఉన్నారు. వారి మధ్య సబ్ వేలో ఓ సంగీతకారుడు గిటారు వాయిస్తున్నాడు. ఆయనను ఎవరూ పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. అయితే, ఓ పాప మాత్రం ఆయన సంగీతం, పాటను వింటూ ఆయన వద్దే ఆగిపోయింది. దీంతో తనకు దొరికిన ఒకే ఒక ప్రేక్షకురాలి కోసం ఆ సంగీతకారుడు పాట పాడుతూ, గిటారు వాయిస్తూ ఉండిపోయాడు.
ఆయన పాటకు ఆ పాప ముగ్దురాలైపోయింది. ఎటూ కదలకుడా నిలబడి పాట, సంగీతాన్ని విన్నది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఒకరు వీడియో తీశారు. గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ సంస్థ తమ సామాజిక మాధ్యమాల ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది. హృదయాన్ని కరిగించేలా ఈ వీడియో ఉందని పేర్కొంది.
మొదట ఆ సంగీతకారుడు ‘‘వాట్ ఏ వండర్ ఫుల్ వరల్డ్’’ పాట పాడుతూ గిటారు వాయించాడు. ఆ పాప ఆయన వద్ద ఆగగానే ‘‘వాట్ ఏ వండర్ ఫుల్ గర్ల్’’ అంటూ లిరిక్స్ ను మార్చి పాడాడు. సంగీతానికి చిన్నారులు కూడా ఇంతగా స్పందిస్తారన్న విషయం తమకు ఇప్పుడే తెలిసిందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. ఆమె ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రేక్షకురాలు అంటూ ఆ పాపను పలువురు నెటిజన్లు ప్రశంసించారు.
View this post on Instagram
Yatra Breach: రాహుల్ భద్రతపై కాంగ్రెస్ ఆందోళన.. భద్రత కల్పించాలంటూ అమిత్ షాకు లేఖ