Viral Video: డ్రోన్‌ను చూసి భయంతో బుడ్డోడి పరుగు.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. మరో ఉస్సేన్ బోల్ట్ అంటూ కామెంట్స్
వీడియో ప్రకారం.. ఓ గ్రామంలో ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో డ్రోన్ వారివద్దకు దూసుకొచ్చింది. దీంతో వారు భయంతో ..

Viral Video
Viral Video: గతంలో డ్రోన్ ను పల్లెల్లో వింతగా చూసేవారు. కానీ, ప్రస్తుతం టెక్నాలజీ వేగంగా ప్రజలకు అందుబాటులోకి వస్తుండటంతో గ్రామాల్లోనూ డ్రోన్ల సంఖ్య పెరుగుతుంది. పెండ్లిళ్లలో వీడియోలు తీసే సమయంలోనూ, పొలాల్లో మందుల పిచికారికి.. యూట్యూబ్ వీడియోలకోసం ఇలా పలు రకాల పనులకోసం డ్రోన్లు వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. అయితే, ఓ గ్రామంలో బుడ్డోడు డ్రోన్ వస్తుండటాన్ని చూసి భయంతో పరుగు లంకించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ఈ వీడియోను చూసిన నెటిజన్లు మరో ఉస్సేన్ బోల్ట్ అంటూ ప్రశంసిస్తున్నారు.
వీడియో ప్రకారం.. ఓ గ్రామంలో ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో డ్రోన్ వారివద్దకు దూసుకొచ్చింది. దీంతో వారు భయంతో పరుగు తీశారు. ఇద్దరు పిల్లలు ఒకవైపు పరుగెత్తగా.. మరొక పిల్లవాడు భయంతో వేగంగా పరుగెత్తుకుంటూ మరోవైపు వెళ్లాడు. ఆ డ్రోన్ ను ఆపరేట్ చేసే వ్యక్తి ఆ పిల్లవాడి వెంటే పోనివ్వడంతో అతను భయంతో వెనక్కు చూడకుండా దౌడు తీశాడు. ఈ వీడియోలో పిల్లవాడి ప్రవర్తన నవ్వు తెప్పిస్తున్నప్పటికీ అతడి పరుగులో వేగం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
వీడియోను ‘ఫన్ ఫ్యాక్ట్’ అనే ట్విటర్ ఖాతా నుంచి షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఈ పిల్లవాడు మరో ఉసేన్ బోల్ట్ అవుతాడు అంటూ పేర్కొనగా.. మరో నెటిజన్.. దాన్ని వదిలేయండి బ్రదర్.. అతడు భయపడ్డాడు.. అంటూ పేర్కొన్నాడు. మరొకరు.. బ్రదర్, అంత వేగంగా పరుగెత్తేది పిల్లాడా లేక జెట్ విమానమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అధిక శాతం మంది నెటిజన్లు పిల్లవాడు వేగంగా పరుగెత్తడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది పాత వీడియోనే అయినా.. ఈ ఘటన ఎక్కడిది అనే విషయాన్ని ఖాతాదారుడు తెలియజేయలేదు. ‘‘పల్లెటూరి పిల్లలు మొదటిసారి డ్రోన్ ను చూశారు’’ అంటూ రాశారు.
Village kids see a drone for the first time. pic.twitter.com/cu8NeblK2G
— FunFacts (@funfacts_avatar) February 1, 2025