Viral Video : అమ్మ బాబోయ్.. నీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్.. సింగిల్ హ్యాండ్ తో భారీ కొండచిలువను ఎలా బయటకు తీశాడో చూస్తే గూస్ బంప్సే..

ఆ వ్యక్తి గుండె ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రియల్ హీరో అని అతడిపై ప్రశంసలు కురిపించారు.

Viral Video : అమ్మ బాబోయ్.. నీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్.. సింగిల్ హ్యాండ్ తో భారీ కొండచిలువను ఎలా బయటకు తీశాడో చూస్తే గూస్ బంప్సే..

Updated On : February 3, 2025 / 11:37 PM IST

Viral Video : చిన్న పాముని దూరం నుంచి చూస్తేనే భయంతో ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. వెన్నులో వణుకు మొదలవుతుంది. అలాంటి పేద్ద కొండచిలువ కనిపిస్తే.. వామ్మో.. ఇంకేమైనా ఉందా? గుండె ఆగినంత పని అవుతుందంటారేమో? మన సంగతి అటుంచితే.. అతడు మాత్రం మనలా కాదు.

కళ్ల ముందు భారీ కొండచిలువ ఉన్నా అస్సలు భయపడలేదు. పైగా ఒట్టి చేతులతో దాన్ని పట్టుకున్నాడు. కెనాల్ నుంచి బయటకు తీశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చాడు..
కెనాలో భారీ కొండచిలువ కనిపించింది. దీంతో స్థానికులు భయపడిపోయారు. చుట్టూ జనం చేరారు. ఇంతలో ఒక వ్యక్తి ధైర్యంగా ముందుకు వచ్చాడు. కెనాల్ నుంచి కొండచిలువను బయటకు తీస్తానన్నాడు. అంతేకాదు.. కాలువ అంచున సిమెంట్ పెళ్లపై నిలబడి నీళ్లలో ఉన్న కొండచిలువను ఇనుప కడ్డీ సాయంతో పట్టుకున్నాడు. దాన్ని కాస్త పైకి ఎత్తి కాలిపై వేసుకున్నాడు. ఆ తర్వాత ఒంటి చేత్తో దాన్ని తోకను గట్టిగా పట్టుకున్నాడు. ఆ తర్వాత కొండచిలువను కెనాల్ నుంచి బయటకు తీసేశాడు.

Also Read : ఎంత కర్మ పట్టిందిరా అయ్యా నీకు.. దొంగగా మారిన మాజీ ఎమ్మెల్యే కొడుకు.. ఎందుకో తెలిస్తే షాకే..

ప్రాణాలను పణంగా పెట్టి సాహసం..
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడి గుండె ధైర్యానికి, గట్స్ కి అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అక్కడ చాలా ప్రమాదం పొంచి ఉంది. అయినా అతడు భయపడలేదు. అక్కడ ఏ మాత్రం పొరపాటు జరిగినా అతడు నీళ్లలోకి పడిపోవడం ఖాయం.  కొండచిలువ దాడి చేసే ప్రమాదమూ ఉంది. ప్రాణాలకే రిస్క్. అయినా అతడు భయపడలేదు.

 

View this post on Instagram

 

A post shared by vishal snake saver (@vishalsnakesaver)

ఎంతో నేర్పుగా, చాక్యచక్యంగా వ్యవహరించి కొండచిలువను బయటకు తీశాడు. ఒక చేత్తో కెనాల్ గోడను పట్టుకున్నాడు, మరో చేత్తో కొండచిలువను హ్యాండిల్ చేశాడు. ఈ క్రమంలో ఏదైనా పొరపాటు జరిగి ఉంటే.. అతడి ప్రాణాలే ప్రమాదంలో పడేవి.

Also Read : బాప్ రే.. ఒక్క ఫోన్ కాల్‌తో 11 లక్షలు పోగొట్టుకున్న ఐటీ ఉద్యోగిని.. బీకేర్ ఫుల్ అంటున్న పోలీసులు.. ఏం జరిగిందో తెలిస్తే షాకే..

రియల్ హీరో అంటూ కితాబు..
ఆ వ్యక్తి గుండె ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రియల్ హీరో అని అతడిపై ప్రశంసలు కురిపించారు. విష సర్పాలను ఈ విధంగా పట్టుకోవడం ప్రాణాలకే ప్రమాదం అని తెలిసినా.. అతడు చేసిన సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే అంటున్నారు.