Viral Video: నిజమైన భార్యాభర్తల బంధం అంటే ఇదే.. వైరల్ అవుతున్న వృద్ధ దంపతుల వీడియో

తాజాగా ఒక వృద్ధ జంట అలాంటి అపురూపమైన దాంపత్య బంధానికి నిదర్శనంగా నిలిచింది. వృద్ధుడైన భర్తకు అతడి భార్య తన చేత్తో అన్నం తినిపిస్తున్న వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారో తెలీదు.

Viral Video: నిజమైన భార్యాభర్తల బంధం అంటే ఇదే.. వైరల్ అవుతున్న వృద్ధ దంపతుల వీడియో

Updated On : February 19, 2023 / 5:13 PM IST

Viral Video: సరైన జీవిత భాగస్వామి దొరికితే దాంపత్య బంధం అత్యంత మధురంగా ఉంటుంది. దశాబ్దాలు గడుస్తున్నా ఒకరిపై ఒకరికి మమకారం తగ్గదు. ఎన్నేళ్లైనా ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అలాంటి జంటలెన్నో మనకు కనబడుతూనే ఉంటాయి.

Youngest Organ Donor: తండ్రి కోసం పదిహేడేళ్ల కూతురు త్యాగం.. అతి చిన్న వయసులో లివర్ దానం.. అరుదైన రికార్డు

తాజాగా ఒక వృద్ధ జంట అలాంటి అపురూపమైన దాంపత్య బంధానికి నిదర్శనంగా నిలిచింది. వృద్ధుడైన భర్తకు అతడి భార్య తన చేత్తో అన్నం తినిపిస్తున్న వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారో తెలీదు. ఈ వీడియో ప్రకారం.. వృద్ధాప్యంతో, చేతకాని స్థితిలో ఉన్న భర్తకు అతడి భార్య చేతితో కలిపి భోజనం తినిపిస్తోంది. ఈ వీడియోను అబా జియోన్ అనే యానిమేటర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

ప్రస్తుతం, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో 11 మిలియన్లకుపైగా వ్యూస్ దక్కాయంటే ఆ వీడియో నెటిజన్ల హృదయాలను ఎలా తాకిందో అర్థం చేసుకోవచ్చు. వీడియోపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను నిజమైన ప్రేమకు నిదర్శనంగా చెబుతున్నారు. కావాలంటే ఈ వీడియో మీరూ చూడండి.

 

View this post on Instagram

 

A post shared by Aba Zeons  (@aba_zeons)