రూ.1000లకే 10 షర్టులు.!!..భయంలేకుండా..జాతరకొచ్చినట్లుగా ఎగబడ్డ జనాలు..

కరోనా కాలంలో అన్ లాక్ ప్రారంభమైంది. షాపులు తెరుచుకుంటున్నాయి. కొన్ని నెలలుగా షాపులన్నీ మూసి ఉండటంతో యజమానులు నష్టాల్లో పడ్డారు. మరోపక్క షాపులు తెరిసినా కష్టమర్లు కూడా పెద్దగా రావటంలేదు. బట్టల షాపుల పరిస్థితి కూడా అలాగే ఉంది. దీంతో ఆఫర్లు ప్రకటించి కష్టమర్లను ఆకట్టుకోవటానికి రకరకాల ఆఫర్లతో నానా తంటాలు పడుతున్నారు. ఆఫర్ అంటే చాలు కరోనా కాలమైన ఏ కాలమైనా జనాలు ఎగబడి వచ్చేస్తారని తెలుసు..
అదిగో అటువంటి ఆఫరే కాదు ఏకంగా బంపర్ ఆఫరే ప్రకటించాడు ఓ బట్టల షాపు యజమాని..ఇంకేముంది అతని అంచనాను మించి ఎగబడి మరీ వచ్చేశారు. ఇంతకీ ఆ ఆఫర్ ఏమిటంటే..కేవలం ‘రూ.1000 లకు 10 షర్టులు..లేదా 10 ప్యాంట్లు’అని ప్రకటించేసరికి ఇక జనాలు ఎక్కడాగుతారు..భారీగా వచ్చిపడ్డారు. గుంపులు గుంపులుగా విరగబడి మరీ వచ్చేశారు..
https://10tv.in/avoid-being-singham-ensure-actual-work-is-not-ignored-pm-modis-message-to-young-ips-officers/
చెన్నై రాయపేటలోని డాక్టర్ బీసెంట్ రోడ్డులోని ఓ బట్టల షాపు వద్ద గుంపులు గుంపులుగా ఉన్న జనాల ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. కరోనాకు వెల్‌కమ్ చెప్పేసినట్లు…రూ.1000 కి 10 షర్టులు అని తెలిసేసరికి..నిమిషం కూడా ఆలస్యం చేస్తే ఆశాభంగమే అన్నట్లుగా..చాలామంది ముఖాలకు కనీసం మాస్కులు కూడా పెట్టుకోకుండా వచ్చేశారు. ఇక భౌతిక దూరం మాటేలేదు. ఈ విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి గుంపును చెదరగొట్టారు. ఆ తరువాత ఈ కరోనా కాలంలో నీ వ్యాపారం కోసం ప్రజల్ని చంపేస్తావా ఏంటీ..అంటూ ఆ షాపును సీజ్ చేసిపడేశారు. దీంతో జనాలు ముఖాలు దిగాలేసుకుని ఎక్కడివారక్కడకు వెళ్లిపోయారు.
దీనిపౌ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) తేనంపేట జోనల్ అధికారి మాట్లాడుతూ..ప్రస్తుతం ఈ కరోనా పరిస్థితుల్లో ఇటువంటి ఆఫర్ల పేరుతో ప్రజల జీవితాలతో ఆటలాడుకోవద్దంటూ సూచించారు. సదరు షాపును సీజ్ చేశామని తెలిపారు.