Mahindra Scorpio: మహీంద్రా స్కార్పియోలో పోలీసుల శాండ్ మాఫియా ట్రాక్టర్ చేజ్
ఇండియన్ మార్కెట్ లో ఓ రేంజ్ లో అమ్మకాలు జరిపిన మహీంద్రా స్కార్పియో.. ఇప్పటికీ కొందరికి ఫేవరేట్ వెహికల్ గానే ఉంది. కొన్ని ప్రభుత్వ ఏజెన్సీలు కూడా అఫీషియల్ ట్రాన్స్‌పోర్ట్ కోసం వాడుకుంటున్నారు.

Mahindra Scorpio
Mahindra Scorpio: ఇండియన్ మార్కెట్ లో ఓ రేంజ్ లో అమ్మకాలు జరిపిన మహీంద్రా స్కార్పియో.. ఇప్పటికీ కొందరికి ఫేవరేట్ వెహికల్ గానే ఉంది. కొన్ని ప్రభుత్వ ఏజెన్సీలు కూడా అఫీషియల్ ట్రాన్స్‌పోర్ట్ కోసం వాడుకుంటున్నారు. పోలీసుల్లో కూడా వాహనాలు వాడుతున్నా చేజింగ్ కోసం దీనిని వాడారని మీకు తెలుసా.. అవును ఇది నిజం. ఈ వీడియోలో ఇసుక మాఫియా చేస్తున్న ట్రాక్టర్ ను చేజ్ చేసేందుకు పోలీసులు స్కార్పియోను వాడేశారు.
నది ఒడ్డున అక్రమంగా తరలిస్తున్న ఇసుకను పాట్రోలింగ్ వెహికల్ తో పట్టుకున్నారు. చట్ట వ్యతిరేకమైన పనులు చేసే క్రమంలో అప్ డేటెడ్ వెహికల్స్ అయితే వేగానికి సరిపోతాయి కానీ, నది ఒడ్డు కావడం, ఇసుక ప్రాంతం కావడంతో అది సాధ్యపడింది.
పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ట్రాక్టర్ డ్రైవర్ ఎంత ప్రయత్నించినా కుదరలేదు. చివరికి పోలీసుల నుంచి తప్పించుకోలేక నది వైపుకు పోనిచ్చాడు. అయినా పోలీసులు వదల్లేదు. నీటి లెవల్ ఎత్తుగా ఉన్నా.. అదే స్పీడ్ తో వెళ్తూనే ఉన్నారు. స్కార్పియో సగం వరకూ నీటిలో మునిగిపోయింది. స్కార్పియో దాదాపు ట్రాక్టర్ కు దగ్గరగా చేరిపోతుందనగా మళ్లీ ట్రాక్టర్ డ్రైవర్ ఒడ్డు వైపుకు డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు.
మరోసారి ట్రాక్టర్ ను ఫాలో అయిన పోలీసుల స్కార్పియో పట్టేసుకున్నారు అనుకునేలోపు మళ్లీ నీళ్లలోకి తిప్పేశాడు ట్రాక్టర్ డ్రైవర్.. ఈ సారి ఇంకా లోతైన ప్రాంతానికి వెళ్లిపోయారు. పోలీసులు మరోసారి నీళ్లలోకి వచ్చే ధైర్యం చేయలేరని అనుకున్నాడు ట్రాక్టర్ నడిపే వ్యక్తి. తమ నుంచి ట్రాక్టర్ దూరంగా వెళ్లిపోతుందని పసిగట్టిన పోలీసులు.. స్కార్పియోపై నమ్మకం ఉంచి పోనిచ్చేశారు. ముందుకు వెళ్లలేకపోయిన ట్రాక్టర్ డ్రైవర్ ను పట్టుకోగలిగారు.